జీడి ప్రాసెసింగ్ పక్కాగా జరగాలి
ABN , Publish Date - Jun 26 , 2025 | 11:47 PM
జీడి ప్రాసెసింగ్ పక్కాగా జరగాలని, వీడీవీకేలు నిర్వహించుకునేలా శిక్షణ ఇవ్వాలని ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాత్సవ అధికారులను ఆదేశించారు.
- ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాత్సవ
పార్వతీపురం, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): జీడి ప్రాసెసింగ్ పక్కాగా జరగాలని, వీడీవీకేలు నిర్వహించుకునేలా శిక్షణ ఇవ్వాలని ఐటీడీఏ పీవో అశుతోష్ శ్రీవాత్సవ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం పార్వతీపురంలోని జీడిపప్పు ప్రాసెసింగ్ యూనిట్, నిత్యావసర సరుకుల గోదామును ఆయన గురువారం తనిఖీ చేశారు. అలాగే, వ్యవసాయ మార్కెట్ యార్డులోని గోదాములో జీడిపప్పు ప్రాసెసింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లను పరిశీలించారు. జీడిపిక్కలను స్టాక్ మేరకు రిజిష్టర్‌లో నమోదు చేసే ప్రక్రియను తనిఖీ చేశారు. జీడి ప్రాసెసింగ్ పక్కాగా జరగాలని ఆదేశించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన వెంట ఏపీడీ ఎ.మురళీధర్, ఇతర అధికారులు ఉన్నారు.