Share News

Cash snatching.. caught by the police.. నగదు కొట్టేసి.. పోలీసులకు చిక్కి..

ABN , Publish Date - Nov 13 , 2025 | 12:04 AM

Cash snatching.. caught by the police..డిగ్రీ చదివాడు.. ఆపై వ్యసనాలబారిన పడ్డాడు. కేబ్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు.. వచ్చే సొమ్ము ఎటూ చాలకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టాడు. ఏటీఎం సెంటర్లను ఎంచుకున్నాడు.. కేంద్రాలకు వచ్చే వృద్ధులు, చదువురాని వారిని మాటల్లో పెట్టి వారికి సహాయం చేసే ప్రక్రియలో వారి ఏటీఎం కార్డులను మార్చి తన దగ్గర ఉన్న ఏటీఎం కార్డులను వారి చేతుల్లో పెట్టి పరారయ్యేవాడు..

Cash snatching.. caught by the police.. నగదు కొట్టేసి.. పోలీసులకు చిక్కి..

నగదు కొట్టేసి.. పోలీసులకు చిక్కి..

వివిధ జిల్లాల్లో 32 కేసులు నమోదు

రూ.91 వేలు రికవరీ చేసిన పొలీసులు

రాజాం రూరల్‌, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): డిగ్రీ చదివాడు.. ఆపై వ్యసనాలబారిన పడ్డాడు. కేబ్‌ డ్రైవర్‌గా పనిచేసేవాడు.. వచ్చే సొమ్ము ఎటూ చాలకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టాడు. ఏటీఎం సెంటర్లను ఎంచుకున్నాడు.. కేంద్రాలకు వచ్చే వృద్ధులు, చదువురాని వారిని మాటల్లో పెట్టి వారికి సహాయం చేసే ప్రక్రియలో వారి ఏటీఎం కార్డులను మార్చి తన దగ్గర ఉన్న ఏటీఎం కార్డులను వారి చేతుల్లో పెట్టి పరారయ్యేవాడు.. క్షణాల్లో వారివారి ఖాతాల నుంచి నగదును విత్‌డ్రా చేసి ఎంజాయ్‌ చేసేందుకు అలవాటు పడ్డాడు.. ఇదే ప్రక్రియలో ఈనెల 10న రాజాంలోని ఎస్‌బీఐ మెయిన్‌ ఏటీఎం వద్ద నిరీక్షించాడు. అంతలో అక్కడికి వచ్చిన ఓ వ్యక్తిని నమ్మించి క్యాష్‌ డిపాజిట్‌ చేయిస్తానని చెప్పి లక్ష కాజేసి పరారయ్యాడు. పట్టణంలోని కొండంపేట మార్గంలో ఓ ఏటీఎం వద్ద రాజాం పోలీసులు ఆ వ్యక్తిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. రాజాం టౌన్‌ సర్కిల్‌ కార్యాలయంలో బుధవారం రాత్రి ఎస్‌ఐ రవికిరణ్‌తో కలిసి సీఐ కె.అశోక్‌కుమార్‌ వివరాలు తెలియజేశారు. నిందితుడు కాటూరి వెంటకేశ్‌ సొంతూరు గుంటూరు జిల్లా వీరంకివారిపాలేం. వంగర మండలం మరువాడ గ్రామానికి చెందిన పైడిరాజు కలకత్తాలో ఉంటున్న తన కొడుక్కి క్యాష్‌ డిపాజిట్‌ చేసేందుకు ఏటీఎంకి వచ్చి మోసపోయాడు. చోరీచేసిన మొత్తాన్ని వెంకటేశ్‌ తన కుటుంబ సభ్యులకు తలాకొంత ఫోన్‌పే చేశాడు. ఖర్చుల కోసం కొంతమొత్తం తనవద్ద ఉంచుకుని రాజాం ప్రాంతంలో మద్యం సేవిస్తూ తిరుగాడుతూ రాజాం పోలీసులకు చిక్కాడు. నిందితుడిపై గుంటూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్ల, విజయవాడ తదితర ప్రాంతాలలో 32 కేసులున్నాయని సీఐ తెలిపారు. విలేకరుల సమావేశంలో ఎస్‌ఐ రవికిరణ్‌, ఏఎస్‌ఐ రాజశేఖర్‌, కానిస్టేబుళ్లు నాయుడు, సంతు, సత్యన్నారాయణ ఉన్నారు.

Updated Date - Nov 13 , 2025 | 12:04 AM