Case Filed Against Vice MPP వైస్ ఎంపీపీపై కేసు నమోదు
ABN , Publish Date - Apr 19 , 2025 | 11:09 PM
Case Filed Against Vice MPP సాలూరు మండలానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు, పెదపదం ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్‌కుమార్‌పై కేసు నమోదైంది. తన విధులకు ఆటంకం కలిగించడంతో పాటు నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని ఉపాధి హామీ పథకం ఏపీవో టి.రామకృష్ణ ఆయనపై శుక్రవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఆ వైసీపీ నేత బెదిరింపులకు పాల్పడుతున్నట్లు వెల్లడి
సాలూర, ఏప్రిల్19(ఆంధ్రజ్యోతి): సాలూరు మండలానికి చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు, పెదపదం ఎంపీటీసీ, వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్‌కుమార్‌పై కేసు నమోదైంది. తన విధులకు ఆటంకం కలిగించడంతో పాటు నిత్యం వేధింపులకు గురి చేస్తున్నారని ఉపాధి హామీ పథకం ఏపీవో టి.రామకృష్ణ ఆయనపై శుక్రవారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ అప్పలనాయుడు అదే రోజు రాత్రి సురేష్‌కుమార్‌పై కేసు నమోదు చేశారు. దీనిపై శనివారం సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 15న ఎంపీడీవో కార్యాలయంలో నార్లవలస, బొరబంద, శివరాంపురం సర్పంచ్‌ల ఎదుట ఏపీవోపై వైస్ ఎంపీపీ రెడ్డి సురేష్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులకు సంబంధించి పనులే మాత్రమే చేస్తూ.. వారికి లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారని లేనిపోని మాటలతో దుర్భాషలాడారు. అంతే కాకుండా ఏపీవోపై కూర్చి ఎత్తి కొట్టేందుకు ప్రయత్నించారు. ‘ఈ మండలంలో ఎలా ఉద్యోగం చేస్తావో చూస్తా.. నీ అంతు తెలుస్తా’.. అని బెదిరించారు. పెదపదం పంచాయతీలో ఉపాధి హామీ పనులు చేయనీయడం లేదని, దీంతో ఉన్నతాధికారుల నుంచి తనపై ఒత్తిడి ఉందని ఏపీవో ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీఐ వెల్లడించారు. దీనిపై దర్యాప్తు నిర్వహించి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.