క్యారీలను తరలించాలి
ABN , Publish Date - Sep 13 , 2025 | 12:09 AM
జామి మాధవ రాయ మెట్ట వద్ద ఉన్న క్వారీల వివాదం రాజుకుంది.
జామి, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): జామి మాధవ రాయ మెట్ట వద్ద ఉన్న క్వారీల వివాదం రాజుకుంది. ఇక్కడ ఉన్న క్వారీల వల్ల అనారోగ్యం బారిన పడుతు న్నామని అక్కడి కాలనీవాసులు సీపీఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, నాయకుడు డేగల అప్పల రాజు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించారు. వీరికి మద్దతుగా ప్రముఖ న్యాయవాది రమణరావు వచ్చి వీరి సమస్యను తహసీల్దార్‌కు తెలియజేశారు. ఇక్కడ ఉన్న క్రషర్ల ధూళి వల్ల పదుల సంఖ్యలో ప్రజలు అనారోగ్యం బారిన పడ్డారని.. వైద్యం చేయించుకునే స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఇక్కడ ఉన్న క్రషర్లను దూరంగా తరలించాలని కోరారు. దీంతో తహసీల్దార్ కృష్ణంరాజు క్వారీ నిర్వాహకులను పిలిపించారు. అనుమతి పత్రాలను చూపించ మనగా.. కొన్ని పత్రాలను తెప్పించారు. సోమవా రం పూర్తి స్థాయిలో తమ వద్ద ఉన్న పత్రాలను సమర్పిస్తామని చెప్పారు. దీంతో తహసీల్దార్ ఈ వివాదాన్ని వాయిదా వేశారు. తహసీల్దార్ కార్యాలయం వద్ద పరిస్థితులు గందరగోళంగా మారడంతో ఎస్‌ఐ వీరజనార్దన్ తన సిబ్బందితో బందోబస్తు ఏర్పాటుచేశారు.