హైవేపై కారు బోల్తా
ABN , Publish Date - Aug 27 , 2025 | 12:21 AM
మండలంలోని భోగాపురం ఆదర్శ పాఠశాల సమీప జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
భోగాపురం, ఆగస్టు 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని భోగాపురం ఆదర్శ పాఠశాల సమీప జాతీయ రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదం లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు అందించిన సమాచారం ప్రకారం.. విశాఖ జిల్లా కొమ్మాది గ్రామానికి చెందిన పి.రాజేశ్వరి, బి.సంజీవరావు అనే భార్యభర్త లు, లక్ష్మి, మోహిత అనే తల్లీకూతుర్లు కారులో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం జిల్లా బూర్జ శుభకార్యానికి వెళ్తున్నారు. భోగాపురం ఆదర్శ పాఠశాల సమీపం లోని జాతీయ రహదారిపై వచ్చేసరికి వర్షపునీరు కారణంగా ప్రమాదవశాత్తు కారు అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో రాజేశ్వరికి నుదిటిపై తీవ్ర గాయాలు కాగా, మిగతా ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి 108కి సమా చారం అందించి, క్షతగాత్రులను తగరపువలస ప్రైవేటు ఆసుపత్రికి తరలించా రు. రాజేశ్వరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం తెలుసుకున్న సీఐ దుర్గాప్రసాద్‌రావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశారు. దీనిపై సీఐ మాట్లాడుతూ ఈ ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని చెప్పారు.