Share News

Car hits two-wheelers ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లిన కారు

ABN , Publish Date - Sep 07 , 2025 | 11:57 PM

Car hits two-wheelers శిరికిపాలెం వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న మూడు ద్విచక్ర వాహనాల పైకి కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

Car hits two-wheelers ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లిన కారు
ఘటనకు కారణమైన కారు

ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లిన కారు

ఇద్దరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

కారు డ్రైవర్‌ పరారీ

జామి, సెప్టెంబరు 7(ఆంధ్రజ్యోతి): శిరికిపాలెం వద్ద ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ముందు వెళ్తున్న మూడు ద్విచక్ర వాహనాల పైకి కారు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

కొత్తవలస మండలం కాటకాపల్లి గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కారులో వస్తూ శిరికిపాలెం పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ముందు వెళ్తున్న మూడు ద్విచక్ర వాహనాలను బలంగా ఢీకొన్నాడు. ప్రమాదంలో జామి మండలం శిరికిపాలెంకు చెందిన బోనీ సాగర్‌(24), లక్కవరపుకోట మండలం భీమాళికి చెందిన గుల్లిపల్లి సురేష్‌ (32)లు ఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయారు. భీమాళికి చెందిన యువకుడు మిడతాన సూర్యప్రకాశ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనను గమనించిన వెంటనే సమీప ప్రాంతాల యువత పరుగున వచ్చి క్షతగాత్రుడిని తరలించేందుకు 108కి సమాచారం ఇచ్చారు. సూర్యప్రకాశ్‌ను వెంటనే విజయనగరం ఆసుపత్రికి తరలించారు. కారు నడుపుతున్న వ్యక్తి ముగ్గురిని ఢీకొన్నాక సమీపంలో ఉన్న గోడను ఢీకొని ఆగిపోయాడు. కారులోని ఎయిర్‌బెలూన్‌ తెరుచుకోవడంతో డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డాడు. ప్రమాదం జరిగిన వెంటనే పరారీ అయ్యాడు.

Updated Date - Sep 07 , 2025 | 11:57 PM