fall కూలితేగానీ కదలరా?
ABN , Publish Date - Nov 16 , 2025 | 10:53 PM
Can't you move even if you fall? సీతంపేట ఏజెన్సీలో కురసంగి-గెద్దకోల గ్రామాల మధ్య ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. మొంథా తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు రక్షణగోడ కూలింది. దీంతో పాలకొండ నుంచి అంటికొండకు వెళ్లే ఆర్టీసీ సర్వీసును నిలిపేశారు. ఈ నేపథ్యంలో ఆరు గిరిజన గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది.
నిలిచిన ఆర్టీసీ బస్సు సర్వీసు
గిరిజనుల రాకపోకలకు అవస్థలు
సీతంపేట రూరల్, నవంబరు16(ఆంధ్రజ్యోతి): సీతంపేట ఏజెన్సీలో కురసంగి-గెద్దకోల గ్రామాల మధ్య ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. మొంథా తుఫాన్ ప్రభావంతో ఇటీవల కురిసిన వర్షాలకు రక్షణగోడ కూలింది. దీంతో పాలకొండ నుంచి అంటికొండకు వెళ్లే ఆర్టీసీ సర్వీసును నిలిపేశారు. ఈ నేపథ్యంలో ఆరు గిరిజన గ్రామాల ప్రజల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. విద్యార్థులు, గిరిజన రైతులకు రవాణా కష్టాలు మొదలయ్యాయి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియక బిక్కుబిక్కుమంటూ వాహన చోదకులు, గిరిజనులు ప్రయాణించాల్సి వస్తోంది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి బ్రిడ్జ్ నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అంటికొండ, పెద్దగూడ, కురసంగి, అచ్చెబ, లంబగూడ, గెద్దకోల గ్రామాలకు చెందిన గిరిజనులు కోరుతున్నారు.
రక్షణ గోడ నిర్మిస్తాం..
‘అంటికొండకు వెళ్లే మార్గంలో గెద్దకోల-కురసింగి గ్రామాల మధ్య ఉన్న వంతెనను పరిశీ లించాం. వంతెన శిఽథిలావస్థలో లేదు. త్వరలోనే రక్షణ గోడ నిర్మిస్తాం. సామరెల్లి- అంటి కొండవరకు 3.8 కిలోమీటర్ల మేర బీటీ రహదారి నిర్మాణానికి రూ.1.75కోట్లు మంజూరయ్యాయి. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయి.’ అని ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ యూనిట్ (పీఐయూ) డీఈఈ ఎస్.రాధారాణి చెప్పారు.