Share News

గంజాయి స్వాధీనం.. ఐదుగురి అరెస్టు

ABN , Publish Date - Sep 30 , 2025 | 12:07 AM

గంజాయితో ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని, వారికి గంజాయిని సరఫరా చేసిన మరో ముగ్గురిని పట్టుకుని, అరెస్టు చేశామని ఎస్‌ఐ యు.మహేష్‌ సోమవారం తెలిపారు.

గంజాయి స్వాధీనం.. ఐదుగురి అరెస్టు

బొండపల్లి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): గంజాయితో ద్విచక్రవాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరిని, వారికి గంజాయిని సరఫరా చేసిన మరో ముగ్గురిని పట్టుకుని, అరెస్టు చేశామని ఎస్‌ఐ యు.మహేష్‌ సోమవారం తెలిపారు. దీనిపై ఎస్‌ఐ స్థానిక విలేకర్లకు వివరాలు వెల్లడించారు. సాలూరు మండలం సోంపిగాం గ్రామానికి చెందిన సీదరపు రామారావు, అదే మండలం లోని సామంతులవలస గ్రామానికి చెందిన మల్లి నాగరాజు స్థానిక గొట్లాం బైపాస్‌ రోడ్డు వద్ద ద్విచక్ర వాహనాలపై అనుమానాస్పందంగా తిరుగుతుండగా అనుమానం వచ్చి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వారి వద్ద విక్రయిం చడానికి సిద్ధంగా ఉన్న రెండు కిలోల గంజాయిని గుర్తించి, స్వాధీనం చేసుకు న్నామని ఎస్‌ఐ తెలిపారు. అలాగే వీరికి అమ్మకానికి సహకరించిన విజయనగ రానికి చెందిన షేక్‌ మౌళాలి, వినుకొండ విజయ్‌కుమార్‌, బారా సాయిలను కూడా అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ చెప్పారు. వారి నుంచి బైకుతోపాటు నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.

Updated Date - Sep 30 , 2025 | 12:07 AM