Share News

క్యాన్సర్‌పై అవగాహన అవసరం

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:03 AM

క్యాన్సర్‌పై ప్రతిఒక్కరికీ అవగాహన అవసరమని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ అన్నారు.

క్యాన్సర్‌పై అవగాహన అవసరం
జెండా ఊపి ర్యాలీ ప్రారంభిస్తున్న ఎస్పీ దామోదర్‌

- ఎస్పీ దామోదర్‌

విజయనగరం క్రైం, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌పై ప్రతిఒక్కరికీ అవగాహన అవసరమని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ అన్నారు. మహీంద్ర, మహాత్మాగాంధీ క్యాన్సర్‌ ఆసుపత్రుల ఆధ్వర్యంలో శుక్రవారం విజయనగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. అంబేడ్కర్‌ జంక్షన్‌ నుంచి కోట జంక్షన్‌ వరకూ సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే క్యాన్సర్‌ను అధిగమించవచ్చునని అన్నారు. ప్రజల్లో ముఖ్యంగా మహిళల్లో క్యాన్సర్‌పై అవగాహన ఉండాలన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలన్నారు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌పై మహిళల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీని నిర్వహించడం అభినందనీయమన్నారు. పోలీసుశాఖలో కూడా మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారికి క్యాన్సర్‌ స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రి యాజమాన్యాలు చొరవ చూపాలని అన్నారు. కార్యక్రమంలో వైద్యులు ఎం.వెంకటేశ్వరరావు, మహేంద్రగిరి, మురళీకృష్ణ, సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి, సూరినాయుడు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 12:03 AM