Share News

ఆటోలో వచ్చి.. ప్రయాణికులను మభ్యపెట్టి

ABN , Publish Date - Aug 05 , 2025 | 12:48 AM

ఆటోపై వచ్చి ప్రయాణికులను మభ్యపె ట్టి వారి వద్ద బంగారం ఎత్తుకుపోయే ఓ బ్యాచ్‌ను పట్టణ పోలీసులు సోమవా రం పట్టుకున్నారు.

ఆటోలో వచ్చి.. ప్రయాణికులను మభ్యపెట్టి

  • బంగారం చోరీ

  • పోలీసులకు చిక్కి న బ్యాచ్‌

సాలూరు, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): ఆటోపై వచ్చి ప్రయాణికులను మభ్యపె ట్టి వారి వద్ద బంగారం ఎత్తుకుపోయే ఓ బ్యాచ్‌ను పట్టణ పోలీసులు సోమవా రం పట్టుకున్నారు. పట్టణ ఎస్‌ఐ అనీల్‌కుమార్‌ కథనం మేరకు.. మెంటాడ మండలంలోని పిట్టాడ గ్రామానికి చెందిన గొర్లె రమణి, పాల లక్ష్మి, పాల వేణు, పాల శిరీష ప్రస్తుతం గొట్లాం వైఎస్సార్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆదివా రం వీరు నలుగురూ తమ సొంత ఆటోపై సాలూరు వచ్చారు. పాచిపెంట మండలంలోని పి.కోనవలస గ్రామానికి చెందిన గుణాపు సుజాత ఆమె అత్త అప్పలనరసమ్మలు సాలూరు ఏరియా ఆసుపత్రి నుంచి వస్తున్నారు. ఆటో పి.కొనవలస వెళ్తుందని చెప్పడంతో సుజాత, అప్పలనరసమ్మ ఎక్కారు. ఇంతలో పండ్లు కొందామని సుజాత ఆటో ఆపి దిగింది. దీంతో వెంటనే అప్పలనరసమ్మ మెడలో ఉన్న బంగారం గొలుసు లాక్కొన్నారు. కొంత దూరం వెళ్లిన తర్వత ఆమెను దించేసి ఆటోపై ఆ నలుగురు వెళ్లిపోయారు. దీంతో సుజాత పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేసింది. పట్టణ సీఐ అప్పలనాయుడు మూడు బృందా లను ఏర్పాటుచేసి గాలింపు చర్యలు చేపట్టారు. సాలూరు బైపాస్‌ రోడ్డులో నెలిపర్తి సమీపం వద్ద సోమవారం ఆటోలో వెళ్తున్న నలుగురిని గుర్తించి పట్టుకున్నారు. వారి వద్ద నుంచి బంగారం గొలుసును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై గతంలో అనేక కేసులు నమోదయ్యాయి. కాగా కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Updated Date - Aug 05 , 2025 | 12:48 AM