Share News

TDP టీడీపీలో సందడి

ABN , Publish Date - Nov 09 , 2025 | 11:56 PM

Buzz in TDP తెలుగుదేశం పార్టీలో కమిటీ ఎన్నికల సందడి నెలకొంది. గ్రామస్థాయి నుంచి పార్లమెంట్‌ స్థాయి వరకు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. వాస్త వంగా మహానాడుకు ముందే ఇది పూర్తి చేయాలని అధిష్ఠానం భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. దీంతో కమిటీల ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరతీసేందుకు పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది.

  TDP  టీడీపీలో సందడి

  • డిసెంబరుకు ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు

పార్వతీపురం, నవంబరు9(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీలో కమిటీ ఎన్నికల సందడి నెలకొంది. గ్రామస్థాయి నుంచి పార్లమెంట్‌ స్థాయి వరకు ఈ ప్రక్రియ ప్రారంభమైంది. వాస్త వంగా మహానాడుకు ముందే ఇది పూర్తి చేయాలని అధిష్ఠానం భావించినప్పటికీ అది సాధ్యం కాలేదు. దీంతో కమిటీల ఏర్పాటుపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరతీసేందుకు పార్టీ అధిష్ఠానం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించింది. దీనిలో భాగంగా ఇప్పటికే మండల స్థాయి కమిటీకి సంబంధించి ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌ ద్వారా అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. తాజాగా గ్రామస్థాయి కమిటీల ఏర్పాటుకు మెసేజ్‌ల రూపంలో అభిప్రాయాలు స్వీకరిస్తున్నారు. పార్లమెంట్‌ కమిటీ ఏర్పాటుకు సంబంధించి ఇటీవల విశాఖలో సమావేశం నిర్వహించారు. అధికారిక ప్రకటన లేనప్పటికీ పార్లమెంట్‌, మండల స్థాయి కమిటీల ఎంపిక దాదాపు పూర్తయినట్టే అనే వ్యాఖ్యలు విని పిస్తున్నాయి. త్వరలోనే నియోజకవర్గస్థాయి కార్యకర్తలు, నాయకులతో సమావేశమై ఎమ్మెల్యేలు లేదా మంత్రులు ప్రకటించనున్నారు. డిసెంబరు నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటికే టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేశారు.

ఇష్టారాజ్యంగా చేపడితే ఇబ్బందులే ..

జిల్లాలో గ్రామ కమిటీల కూర్పు కొంతమంది ఇష్టారాజ్యంగా చేపడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి సేవ చేస్తున్న కార్యకర్తలు, నాయకుల అభ్రిపా యాలను పరిగణనలోకి తీసుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు, ఆ తర్వాత వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన కొంతమంది నాయకులు ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తున్నారు. కమిటీల ఏర్పాట్లలో అంతా తామే కీలకమని చెబుతూ.. పార్టీ సీనియర్‌ కార్యకర్తలు, నాయకులను అవమానించే పరిస్థితి కొన్ని నియోజకవర్గాల్లో ఉంది. ఇటువంటి పరిస్థితికి చెక్‌ పెట్టకపోతే క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు తప్పవు. ఈ ప్రభావం స్థానిక ఎన్నికలపై పడే అవకాశం ఉన్న నేపథ్యంలో అధిష్ఠానం ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉందని జిల్లా నేతలు అభిప్రాయపడుతున్నారు. పట్టణ కమిటీలపై కూడా శ్రద్ధ చూపి పార్టీకి సేవ చేసిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలని వారు కోరుతున్నారు.

Updated Date - Nov 09 , 2025 | 11:56 PM