బస్సులు లేక ప్రయాణికుల బేజారు
ABN , Publish Date - Nov 08 , 2025 | 11:57 PM
పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పలుచోట్లకు చేరుకోవడానికి అవసరమైనన్ని బస్సులు లేకపోవడంతో ప్రయాణికులకు అగచాట్లు తప్పడంలేదు. ప్రతి పావుగంటకు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఒక బస్సు చొప్పున నడుపుతున్నామని అధికారులు చెబుతున్నా, సకాలంలో బస్సులు అందుబాటులో లేవని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు.
పార్వతీపురంటౌన్, నవంబరు8 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి పలుచోట్లకు చేరుకోవడానికి అవసరమైనన్ని బస్సులు లేకపోవడంతో ప్రయాణికులకు అగచాట్లు తప్పడంలేదు. ప్రతి పావుగంటకు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఒక బస్సు చొప్పున నడుపుతున్నామని అధికారులు చెబుతున్నా, సకాలంలో బస్సులు అందుబాటులో లేవని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. ప్రతిరోజూ ఆర్టీసీకాంప్లెక్స్ నుంచి పార్వతీపు రం, విజయనగరం,విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాలతో పాటు ఇతర జిల్లాలు, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులు నడుపుతున్నారు. అయితే పూర్తిస్థాయిలో సర్వీసులు తిప్పకపోవడం, ప్రైమ్‌టైమ్, సకాలంలో బస్సులు రాకపోవడం వల్ల ప్రైవేటు వాహనాలను ఆశ్రయించా ల్సివస్తోందని పలువురు వాపోతున్నారు. ఇక్కడి ఆర్టీసీ అధికారులు మాత్రం 15 నుంచి 20 నిమిషాల మధ్యలో జిల్లానే కాకుండా ఇతర జిల్లాలకు బస్సులను నడుపుతున్నట్లు చెబుతున్నారు. అయితే పార్వతీపురం కాంప్లెక్స్ నుంచి పూర్తిస్థాయిలో సర్వీసులు లేకపో వడంతో విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందిపడుతున్నారు. చుట్టుపక్కల మండలాల నుంచి పార్వతీపురంలో పలు విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు బస్సుల సమస్య వల్ల సకా లంలో చేరుకోలేకపోతున్నామని వాపోతున్నారు.కాగా పార్వతీపురం డిపో నుంచి పాలకొండ డిపోకు ప్రతి 15 నిమిషాలకో బస్సును, ఇతర జిల్లాలకు 20 నిమిషాలకు ఒక బస్సును నడుపుతున్నట్లు పార్వతీపురం ఆర్టీసీ డిపో మేనేజర్ లక్ష్మణరావు తెలిపారు.