Share News

బస్సులు కిటకిట.. రైళ్లల్లో రద్దీ

ABN , Publish Date - Oct 19 , 2025 | 12:26 AM

విజయనగరం, ఎస్‌.కోట, చీపురుపల్లి తదితర రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు శనివారం కిటకిటలాడాయి. దీపావళి పురస్కరించకుని వివిద ప్రాంతాల్లోగల ఉద్యోగులు, వలస కూలీలు స్వస్థలాలకు రెండు రోజుల ముందుగానే చేరుకుంటున్నారు. దీంతో శనివారం తెల్లవారి నుంచే హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లన్నీ రద్దీగా ఉన్నాయి.

బస్సులు కిటకిట.. రైళ్లల్లో రద్దీ
విజయనగరం బస్టాండ్‌లో బస్సెక్కేందుకు పోటీపడుతున్న ప్రయాణికులు:

విజయనగరం రింగురోడ్డు, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): విజయనగరం, ఎస్‌.కోట, చీపురుపల్లి తదితర రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు శనివారం కిటకిటలాడాయి. దీపావళి పురస్కరించకుని వివిద ప్రాంతాల్లోగల ఉద్యోగులు, వలస కూలీలు స్వస్థలాలకు రెండు రోజుల ముందుగానే చేరుకుంటున్నారు. దీంతో శనివారం తెల్లవారి నుంచే హైదరాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లన్నీ రద్దీగా ఉన్నాయి. నగర, పట్ట ణ ప్రాంతాలన్న తేడాలేకుండా దీపావళిని కుటుంబ సభ్యులతో ఆనందంగా నిర్వ హించేందుకు ఇప్పటికే ఏర్పాట్లుచేసుకున్నారు. ఆదివారం,సోమవారం దీపావళి నేప థ్యంలో వరుస సెలవులు కావడంతో విజయనగరం నుంచి కూడా ఎక్కువ మంది తమ, తమ సొంత ప్రాంతాలకు బయలు దేరి వెళ్లారు.రైల్వే, బస్సు స్టేషన్‌ల్లో ప్రయా ణికులు తమ ప్రాంతాలకు వెళ్లేందుకు గంటలకొద్దీ వేచిఉండాల్సివచ్చింది.

పర్యావరణ దీపావళిపై అవగాహన

ఎస్‌.కోట రూరల్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొట్టాం ప్రభుత్వో న్నతపాఠశాలలో శనివారం పర్యావరణ దీపావళిపై ఇన్‌చార్జి హెచ్‌ఎం రహీంషేక్‌ లాల్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు విద్యార్థులు, గ్రామస్థులకు అవగాహన కల్పించా రు. శబ్ద, వాయుకాలుష్యం వలన కలిగే అనర్థాలు వివరించడంతోపాటు పర్యావరణ పరిరక్షణ కలిగించే విధంగా ఎలా దీపావళి చేసుకోవాలో వివరించారు.

Updated Date - Oct 19 , 2025 | 12:26 AM