Share News

బుల్లెట్‌ వాహనాలే టార్గెట్‌

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:11 AM

దాదాపు ఏడాది కాలం గా జిల్లా కేంద్రంలో బుల్లెట్‌ వాహనాల చోరీలు అధికమయ్యాయి.

బుల్లెట్‌ వాహనాలే టార్గెట్‌

  • పోలీసుల అదుపులో నిందితులు

  • మొత్తం 13 బైకులు స్వాధీనం

విజయనగరం క్రైం, జూలై 16 (ఆంధ్రజ్యోతి): దాదాపు ఏడాది కాలం గా జిల్లా కేంద్రంలో బుల్లెట్‌ వాహనాల చోరీలు అధికమయ్యాయి. దీంతో ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశాల మేరకు దీనిపై పోలీసులు నిఘా పెట్టా రు. ఎట్టకేలకు దొంగ దొరికాడు. బుధవారం స్థానిక వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్పీ విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్‌, టూటౌన్‌ పరిధిలో రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్లు చోరీకి గురైనట్టు ఫిర్యాదులు అందాయని చెప్పారు. దీంతో వన్‌టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో సస్పెక్ట్‌ షీటు కలిగిన తోటపాలెం, వైఎస్సార్‌ నగర్‌కు చెందిన విటి అగ్రహారం బీసీ కాలనీకి చెందిన ఉప్పడాల రాము అలియాస్‌ డీ జేని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఇటీవల జైలు నుంచి విడుదలైన తర్వాత రాము మళ్లీ బైకులు చోరీకి పాల్పడుతున్నా డని చెప్పారు. ఉప్పడాల రాము వద్ద ఏడు బైకులు, రాముకు సహకరి స్తు న్న శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం ముద్దాడ పేటకు చెందిన ముద్దాడ నవీన్‌ అలియాస్‌ టైసన్‌ నుంచి ఆరు బైకులను స్వాధీ నం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. ఉప్పడాల రాము తాను చోరీ చేసిన బైకులను నవీన్‌ సహకారంతో విక్రయించేవాడని చెప్పారు. ఒకటో పోలీసు స్టేషన్‌కు చెందిన పది కేసుల్లో ఏనిమిది రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌, రెం డు యమహా బైకులు, టూటౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో మూడు రాయల్‌ ఇన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌లు ఉన్నాయని ఎస్పీ వివరించారు. కోర్టు ఆదేశా లతో బాధితులకు తిరిగి అందించేందుకు చర్యలు చేపడతామని చెప్పా రు. కేసులు నమోదు చేసి రిమాండ్‌కు త రలిస్తామన్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన వన్‌టౌన్‌ ఎస్‌ఐ సురేంద్రనా యుడు, హెచ్‌సీ రమణరావు, పీసీలు గౌరీశంకర్‌, శివశంకర్‌, టి.శ్రీనివాస్‌, పి.మం జులను ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ శ్రీనివాసరా వు, సీఐ ఆర్‌వీఆర్‌కే చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 12:11 AM