Share News

పాఠశాల నిర్మించి విద్యనందించండి

ABN , Publish Date - Aug 05 , 2025 | 12:40 AM

గ్రామంలో పాఠ శాల నిర్మించి, విద్యనందించాలని కొమరాడ మండ లంలోని పూడేసు పంచాయతీ పరిధిలోగల గుమడాంగి గిరిజనులు, వార్డు సభ్యుడు ఆరిక నాగేశ్వరరావు కోరారు.

 పాఠశాల నిర్మించి విద్యనందించండి
కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలుపుతున్న గుమడాంగి గిరిజనులు :

బెలగాం, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) :గ్రామంలో పాఠ శాల నిర్మించి, విద్యనందించాలని కొమరాడ మండ లంలోని పూడేసు పంచాయతీ పరిధిలోగల గుమడాంగి గిరిజనులు, వార్డు సభ్యుడు ఆరిక నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురంలో ఆ గ్రామానికి చెందిన పిల్లలతో కలిసి కలెక్టరేట్‌ వద్ద నిరసన తెలిపా రు. ఈసందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ గామం లో పాఠశాల లేకపోవడం వల్ల పిల్లలు విద్యకు దూర మవుతున్నారని, పాఠశాలకు వెళ్లాలంటే 15 కిలో మీటర్లు ప్రయాణించాల్సివస్తోందని తెలిపారు.గ్రామంలో 45 కు టుంబాల్లో 20 మంది పిల్లలు ఉన్నారని చెప్పారు.రోడ్లు వేయడంతోపాటు మౌలిక వసుతలు కల్పించాలని కోరా రు. మౌలికవసతులు కల్పించలేకపోతే ఒక కిలోమీటరు దూరంలోగల ఒడిశాలో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పీవో ఆశుతోష్‌, కలెక్టర్‌ శ్యాంప్రసా ద్‌కు తమ సమస్యను వివరించారు. కాగా సమస్యలు చెప్పాలంటే పెద్దవారు రావాలని కానీ, పిల్లలను ఎందుకు తీసుకొచ్చారని, వారికి ఏమైనా జరిగితే బాధ్యు లు ఎవరని కలెక్టర్‌ ఆగ్రహించారు. ఇంకెప్పుడూ పిల్లల ను తీసుకురావద్దని కోరారు.

కోళ్లఫారం తొలగించాలి

గ్రామంలో కోళ్లఫారం తొలగించి, దుర్వాసన నుంచి కాపాడాలని పార్వతీపురం మండలంలోని డోకిశిల పం చాయతీకి చెందిన చలమవలస గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కలెక్టర్‌ కార్యాలయం వద్ద సోమ వారం సీపీఎం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం నాయకులు కృష్ణమూర్తి మాట్లాడు తూ గ్రామంలో కోళ్లఫారం ఏర్పాటు వల్ల దుర్వాసన వస్తుండడంతో స్థానికులు అనారోగ్యానికి గురవు తున్నారని తెలిపారు. కోళ్లఫారానికి అనుమతి ఉందా లేదో తెలియజేయాలని, అనుమతి ఉంటే నిబంధనలు ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు.

Updated Date - Aug 05 , 2025 | 12:40 AM