My Son! నా కొడుకును రప్పించండి!
ABN , Publish Date - Sep 16 , 2025 | 12:00 AM
Bring Back My Son! పనుల కోసమని ఇతర జిల్లాకు వెళ్లిన తన కుమారుడు తప్పిపోయాడని పాచిపెంట మండలం ఏరడ్లవలసకు చెందిన గిరిజనురాలు బట్నాన చిన్నమ్మి తెలిపింది. ప్రస్తుతం జమ్మూలో ఉన్నట్లు తెలిసిందని, వెంటనే స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చింది.
పార్వతీపురం/బెలగాం, సెప్టెంబరు 15(ఆంధ్రజ్యోతి): పనుల కోసమని ఇతర జిల్లాకు వెళ్లిన తన కుమారుడు తప్పిపోయాడని పాచిపెంట మండలం ఏరడ్లవలసకు చెందిన గిరిజనురాలు బట్నాన చిన్నమ్మి తెలిపింది. ప్రస్తుతం జమ్మూలో ఉన్నట్లు తెలిసిందని, వెంటనే స్వగ్రామానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టరేట్ పీజీఆర్‌ఎస్‌లో జాయింట్ కలెక్టర్ యశ్వంత్‌కుమార్ రెడ్డికి వినతిపత్రం ఇచ్చింది. ‘ ఏడాది కిందట ఉపాధి కోసం నా కుమారుడు బట్నాన చిన్నారావు ప్రకాశం జిల్లా వెళ్లాడు. కొన్ని రోజుల తర్వాత తప్పిపోయినట్లు మాకు సమాచారం అందింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఆ తర్వాత చాలాచోట్ల గాలించినా ఫలితం లేకపోయింది. ప్రస్తుతం నా బిడ్డ జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో ఉన్నట్లు అక్కడి పోలీసులు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. తక్షణమే నా కుమారుడిని జిల్లాకు రప్పించండయ్యా.’ అని ఆమె కలెక్టరేట్ ఎదుట ప్లకార్డు ప్రదర్శించి వేడుకుంది.