Share News

రైతు నుంచి లంచం

ABN , Publish Date - Apr 25 , 2025 | 12:02 AM

స్థానిక విద్యుత్‌శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న బి.జోగినాయుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు.

రైతు నుంచి లంచం
లంచం సొమ్ముతో ఏఈ జోగినాయుడు

-విద్యుత్‌ కనెక్షన్‌కు రూ.17వేలు డిమాండ్‌

-ఏసీబీకి చిక్కిన విద్యుత్‌శాఖ ఏఈ

మక్కువ, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): స్థానిక విద్యుత్‌శాఖలో అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న బి.జోగినాయుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఓ రైతు నుంచి గురువారం రాత్రి రూ.17వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ బీవీఎస్‌ఎస్‌ రమణమూర్తి వివరాల మేరకు.. విజయనగరంలో నివాసం ఉంటున్న బి.నరసింహమూర్తి అనే రైతుకు మక్కువ మండలం సరాయివలస రెవెన్యూ పరిధిలో భూములు ఉన్నాయి. ఈ భూముల్లో ఏర్పాటు చేసుకున్న బోరుకు విద్యుత్‌ కనెక్షన్‌ నిమిత్తం మక్కువ విద్యుత్‌శాఖ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ జోగినాయుడును పలుమార్లు సంప్రదించాడు. అయితే, ఎస్టిమేషన్‌ నిమిత్తం ఏఈ రూ.17వేలు డిమాండ్‌ చేశారు. దీనిపై ఈ నెల 22న నరసింహమూర్తి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు మేరకు ఏసీబీ అధికారులు వలపన్ని గురువారం రాత్రి 7 గంటల సమయంలో స్థానిక విద్యుత్‌శాఖ కార్యాలయంపై దాడి చేశారు. రైతు నరసింహమూర్తి నుంచి రూ.17 వేలు లంచం ఏఈ తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసినట్టు డీఎస్పీ తెలిపారు.

Updated Date - Apr 25 , 2025 | 12:02 AM