జ్వరంతో బాలుడి మృతి
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:26 AM
సోమగండి పంచాయతీ పెద్దగూడ గ్రామానికి చెందిన నాలుగు నెలల బాలుడు జ్వరంతో గురువారం మృతిచెందాడు.
సీతంపేట రూరల్, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి): సోమగండి పంచాయతీ పెద్దగూడ గ్రామానికి చెందిన నాలుగు నెలల బాలుడు జ్వరంతో గురువారం మృతిచెందాడు. పెద్దగూడకు చెందిన సవర రాజేంద్ర, సౌందర్య రెండో సంతానంగా బాలుడు జన్మించాడు. ఈనెల 9న బాలుడికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు మంగళవారం రాత్రి సీతంపేట ఏరియా ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. బాలుడు మృతితో తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.