బొత్స అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు
ABN , Publish Date - Aug 31 , 2025 | 11:48 PM
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్టీల్ ప్లాంటు విషయమై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ధ్వజ మెత్తారు.
ఎంపీ కలిశెట్టి
విజయనగరం రూరల్, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్టీల్ ప్లాంటు విషయమై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ధ్వజ మెత్తారు. ఆదివా రం స్థానిక టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన బొత్స కు కనీసం అవగాహన లేదా.. అంటూ ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటుపరం కాదని స్పష్టం చేశారు. ఒక వేళ అదే ఉద్ధేశం ఉంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్టీల్‌ప్లాంటు కోసం నిధులు కేటాయిస్తుందో.. చెప్పాల న్నారు. ఉనికి కోసం నెలకో, రెండు నెలలకో ఒకసారి ప్రెస్‌మీట్లు పెట్టి ఈ విధంగా అసత్యాలు మాట్లాడుతు న్నారన్నారు. విజయనగరం పరిధిలో ఉన్న రైల్వే స్టేషన్ల అభివృద్ధి, సమస్యల పరిష్కారంమై భువనేశ్వర్‌లో డీఆర్‌ఎంకి కలిసి వినతిపత్రం అందించానని తెలిపారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌ని విజయనగరం వరకూ పొడిగించాలన్నారు. టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాదుల ప్రసాద్, కొండప ల్లి భాస్కరనాయుడు, ఆకిరి ప్రసాదరావు, సంతోష్ కుమార్ పాల్గొన్నారు.