Share News

Botcha Visits గురుకులం విద్యార్థినులకు బొత్స పరామర్శ

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:12 AM

Botcha Visits Gurukulam Girl Students పచ్చకామెర్లతో బాధపడుతూ ఇటీవల మృతి చెందిన కురుపాం గురుకులానికి చెందిన ఇద్దరు బాలికల కుటుంబాలను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పరామర్శించారు. శుక్రవారం కురుపాం మం డలం దండుసూర గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు ఆయన ఆర్థిక సాయం అందించారు.

Botcha Visits  గురుకులం విద్యార్థినులకు బొత్స పరామర్శ
పార్వతీపురం జిల్లా కేంద్రాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలికతో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ బొత్స

పార్వతీపురం/బెలగాం/కురుపాం రూరల్‌, అక్టోబరు17(ఆంధ్రజ్యోతి): పచ్చకామెర్లతో బాధపడుతూ ఇటీవల మృతి చెందిన కురుపాం గురుకులానికి చెందిన ఇద్దరు బాలికల కుటుంబాలను ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పరామర్శించారు. శుక్రవారం కురుపాం మం డలం దండుసూర గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు ఆయన ఆర్థిక సాయం అందించారు. మృతి చెందిన బాలికలు కల్పన, అంజలి తల్లులు జయమ్మ, భవానికి వైసీపీ తరఫున రూ. 5 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లా డుతూ.. ప్రభుత్వం ఒక్కో బాలిక కుటుంబానికి రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్‌ చేశారు. కురుపాం గురుకులంలో చదువుతున్న బాలికలకు పూర్తిగా వైద్య పరీక్షలు జరిపి ఆ రిపోర్టులను వారి తల్లిదండ్రులకు అందజేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్సీ బొత్స పార్వతీపురం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అక్కడ జాండీస్‌తో చికిత్స పొందుతున్న కురుపాం గురుకులం, ఏకలవ్య పాఠశాలల విద్యార్థినులను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ప్రభుత్వం వసతి గృహాల్లో మౌలిక వసతులు కల్పించి, అందరికీ మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. ఆయన వెంట జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, రాజన్న దొర, కళావతి, జోగారావు తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 18 , 2025 | 12:12 AM