Students విద్యార్థులతో మమేకమై..
ABN , Publish Date - Dec 27 , 2025 | 10:52 PM
Bonding Closely with Students పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సందర్శించారు. తొలుత ముస్తాబు కార్యక్రమాన్ని పరిశీ లించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఏరోబిక్ నృత్యం చేశారు.
పాలకొండ, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను శనివారం సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ సందర్శించారు. తొలుత ముస్తాబు కార్యక్రమాన్ని పరిశీ లించారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఏరోబిక్ నృత్యం చేశారు. మధ్యాహ్న భోజనం రుచిచూసి సంతృప్తి వ్యక్తం చేశారు. పిల్లలకు పౌష్టికాహారం అందించాలని, పక్కాగా మెనూ అమలు చేయాలని సూచించారు. ఆయన వెంట ఉపవిద్యాశాఖాధికారి కృష్ణమూర్తి, ఎంఈవో సోంబాబు, హెచ్‌ఎం నాగభూషణ, సంస్కృత ఉపాధ్యాయులు బౌరోతు శంకరరావు తదితరులు పాల్గొన్నారు.
పక్కాగా చెత్త సేకరణ
పట్టణంలోని అన్నివార్డుల్లో పక్కాగా చెత్తసేకరణ జరగాలని సబ్ కలెక్టర్ ఆదేశించారు. శనివారం నగర పంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఆస్తిపన్ను వసూళ్లపై ప్రతివారం నివేదిక పంపాలన్నారు. పట్టణంలో చెత్తసేకరణను శానిటేషన్ అధికారులు పర్యవేక్షించాలని సూచించారు.