Share News

కలెక్టర్‌ దృష్టికి బొబ్బిలి నియోజకవర్గ సమస్యలు

ABN , Publish Date - Jun 27 , 2025 | 12:12 AM

బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధిం చిన పలు సమస్యలపై కలెక్టర్‌ అంబే డ్కర్‌తో చర్చించినట్లు ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్‌ తెంటు లక్ష్ము నాయుడు తెలిపారు.

కలెక్టర్‌ దృష్టికి బొబ్బిలి నియోజకవర్గ సమస్యలు

బొబ్బిలి, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధిం చిన పలు సమస్యలపై కలెక్టర్‌ అంబే డ్కర్‌తో చర్చించినట్లు ఎమ్మెల్యే బేబీ నాయన, బుడా చైర్మన్‌ తెంటు లక్ష్ము నాయుడు తెలిపారు. కలెక్టర్‌ చాంబర్‌ లో ఆయన్ని గురువారం కలిసి, సమ స్యలు వివరించామన్నారు. బొబ్బిలి- రామభద్రపురం- పార్వతీపురం రహ దారిలో గొర్లెసీతారాంపురం, పాతబొబ్బిలి దగ్గర దారుణంగా పాడైన రోడ్ల మరమ్మ తుకు మంజూరు చేసిన రూ.10లక్షల నిధులు విడుదల చేయాలని కలెక్టర్‌ను కోరామన్నారు. పారాది గ్రామంలో బీసీ హాస్టల్‌ ఏర్పాటు చేయాలని కోరామని చెప్పారు. బుడా పరిధిలో పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరగా కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారని చెప్పారు. కొన్ని అంశాలకు సంబంధించి అధికారులకు అక్కడికక్కడే కలెక్టర్‌ ఆదేశాలిచ్చారని బేబీనాయన, తెంటు తెలిపారు.

కేంద్ర మాజీ మంత్రి పి.అశోక్‌గజపతి రాజు పుట్టినరోజు సందర్భంగా ఎమ్మెల్యే బేబీనాయన ఆయన్ని మర్యాదపూర్వకంగా కలిసి, శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Jun 27 , 2025 | 12:12 AM