బీఎల్‌ఏలను నియమించాలి
ABN , Publish Date - Dec 18 , 2025 | 11:50 PM
ప్రతి పోలింగ్ బూత్‌కు తమ ప్రతినిధిగా ఒక ఏజెంట్(బీఎల్‌ఏ)ను ఆయా రాజకీయ పార్టీలు నియమించుకోవాలని డీఆర్వో మురళి కోరారు.
విజయనగరం, కలెక్టరేట్, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రతి పోలింగ్ బూత్‌కు తమ ప్రతినిధిగా ఒక ఏజెంట్(బీఎల్‌ఏ)ను ఆయా రాజకీయ పార్టీలు నియమించుకోవాలని డీఆర్వో మురళి కోరారు. గురువారం సాయంత్రం తమ చాంబర్‌లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహిం చారు. ప్రతి నియోజకవర్గంలో అదే నియోజకవర్గంలో ఎక్కడైనా బీఎల్‌ఏగా నియమించుకోవాలన్నారు. ప్రస్తుతం జిల్లాలో 15,73,576 మంది ఓటర్లు ఉన్నారని, మార్పులు చేర్పులు చేసుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నుంచి ఐవీపీ రాజు, వైసీపీ నుంచి శ్రీనివాస్‌రెడ్డి, సీపీఎం నుంచి సూర్యనారాయణ ఉన్నారు.