Share News

Births should be registered ప్రసవాలను నమోదు చేయాలి

ABN , Publish Date - May 31 , 2025 | 11:04 PM

Births should be registered జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజువారీ ప్రసవాలను నమోదు చేసి ఆయా ఆసుపత్రుల నుంచి ప్రతి రోజూ సమాచారం సేకరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ బీఅర్‌ అంబేడ్కర్‌ వైద్యాధికారులను ఆదేశించారు. లింగనిర్ధారణ నిరోధక చట్టం అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగింది.

Births should be registered ప్రసవాలను నమోదు చేయాలి
వైద్యాధికారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ అంబేడ్కర్‌

ప్రసవాలను నమోదు చేయాలి

ప్రతి రోజూ ఆస్పత్రుల నుంచి సమాచారం తీసుకోవాలి

స్కానింగ్‌ కేంద్రాల వద్ద హెచ్చరిక బోర్డులుండాలి

కలెక్టరు బీఅర్‌ అంబేడ్కర్‌

విజయనగరం రింగురోడ్డు, మే 31 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజువారీ ప్రసవాలను నమోదు చేసి ఆయా ఆసుపత్రుల నుంచి ప్రతి రోజూ సమాచారం సేకరించే వ్యవస్థను ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ బీఅర్‌ అంబేడ్కర్‌ వైద్యాధికారులను ఆదేశించారు. లింగనిర్ధారణ నిరోధక చట్టం అమలుపై జిల్లా స్థాయి కమిటీ సమావేశం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో శనివారం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రైవేటు ఆసుపత్రుల్లో జరిగే గర్భస్రావాల సమాచారం కూడా వెంటవెంటనే అందజేయాలని ఆదేశించారు. ఏప్రిల్‌ నెలకు సంబంధించి ప్రసవాల సమాచారాన్ని నివేదించాలన్నారు. అలాగే స్కానింగ్‌ కేంద్రాల్లో ప్రతి రోజు ఎన్ని స్కానింగులు జరుగుతున్నాయన్న అంశంపై కూడా నివేదిక ఇవ్వాలన్నారు. అన్ని స్కానింగ్‌ కేంద్రాల్లో లింగనిర్ధారణ సమాచారం తెలియజేయడం జరగదనే హెచ్చరిక బోర్డులను సందర్శకులకు స్పష్టంగా కన్పించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. స్కానింగ్‌ కేంద్రాల్లో నిర్వహించే పరీక్షలకు ఆయా ఆసుపత్రులు వసూలు చేసే ఛార్జిల వివరాలతో కూడిన ధరల పట్టికను కూడా బోర్డు రూపంలో ప్రదర్శించాలని ఆదేశించారు. స్కానింగ్‌ కేంద్రాలపై వైద్య ఆరోగ్యశాఖకు పూర్తిస్థాయిలోనియంత్రణ ఉండాలన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టరు జీవనరాణి, అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టరు కె.రాణి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టరు ఎన్‌.సూర్యనారాయణ, ఆర్‌బీఎస్‌కె పీఓ డాక్టరు డీవీబీ సుబ్రహ్మణ్యం, లింగ నిర్ధారణ చట్టం అమలు అధికారి ఆర్‌.అచ్యుతాకుమారి పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2025 | 11:04 PM