Share News

పీహెచ్‌సీలో ప్రసవాలు పెంచాలి: డీఎంహెచ్‌వో

ABN , Publish Date - Nov 15 , 2025 | 12:05 AM

పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెంచేలా చర్యలు తీసుకోవా లని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జీవనరాణి ఆదేశించారు. శుక్రవారం పొగిరి పీహెచ్‌సీతో పాటు లెప్పర్సీ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు

 పీహెచ్‌సీలో ప్రసవాలు పెంచాలి: డీఎంహెచ్‌వో
మాట్లాడుతున్న జీవనరాణి:

రాజాం, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): పీహెచ్‌సీల్లో ప్రసవాలు పెంచేలా చర్యలు తీసుకోవా లని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి జీవనరాణి ఆదేశించారు. శుక్రవారం పొగిరి పీహెచ్‌సీతో పాటు లెప్పర్సీ ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీహెచ్‌సీల్లో ప్రసవాలు సంఖ్య తగ్గుతున్నాయని, ఇచ్చిన లక్ష్యలను పూర్తిచేసేలా చర్యలు తీసుకోవా లని వైద్యులను ఆదేశించారు.ఈవిషయంలో నిర్లక్ష్యం చేయకుండా సబ్‌సెంటర్లు సిబ్బం దిని హెచ్చరించాలని సూచించారు. ఎన్‌సీడీ సర్వేను సకాలంలో పూర్తిచేయాలని ఆదేశించారు. ఈనెల 17 నుచి లెప్పర్సీకి సంబంధించి ప్రత్యేక సర్వే నిర్వహించ నున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పొగిరి పీహెచ్‌సీ వైద్యాధికారి గట్టి భార్గవి, లెప్పర్సీ వైద్యాధికారి జంపు రాజమోహన్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2025 | 12:05 AM