బిల్లులు వెనక్కి తీసుకోవాలి
ABN , Publish Date - Nov 03 , 2025 | 11:57 PM
ఉచిత విద్యుత్ అని చెప్పి గిరిజనులను ప్రభు త్వం మోసం చేస్తోందని, గిరిజనుల గృహాలకు ఇచ్చిన విద్యుత్ బిల్లులను వెనక్కి తీసు కోవాలని సీపీఎం నాయకుడు చల్లా జగన్ డిమాండ్ చేశారు.ఈ మేరకు మారిక గిరిజ నులు వేపాడలోని విద్యుత్‌కార్యాలయం తలుపుమూసివేసి సోమవారం నిరసన తెలిపా రు.
వేపాడ, నవంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఉచిత విద్యుత్ అని చెప్పి గిరిజనులను ప్రభు త్వం మోసం చేస్తోందని, గిరిజనుల గృహాలకు ఇచ్చిన విద్యుత్ బిల్లులను వెనక్కి తీసు కోవాలని సీపీఎం నాయకుడు చల్లా జగన్ డిమాండ్ చేశారు.ఈ మేరకు మారిక గిరిజ నులు వేపాడలోని విద్యుత్‌కార్యాలయం తలుపుమూసివేసి సోమవారం నిరసన తెలిపా రు. ఈ సందర్భంగా జగన్, మారిక గిరిజనులు మాట్లాడుతూ ఉచిత బిల్లు ఇవ్వాల్సిన చోట 12 వేలు, రూ.7000లకు బిల్లులు ఇచ్చి కట్టమని డిమాండ్ చేయడం సరికాదని తెలిపారు.బిల్లులు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. గిరిజనుల ఆందోళన చేస్తున్న విషయాన్ని లైన్‌మన్ కుమార్ ఉన్నతాధికారులకు తెలి యజేశారు.దీంతో ఏఈ సూరిబాబు సీపీఎం జిల్లా నాయకుడు చల్లా జగన్‌కు పోన్ చేసి మాట్లాడారు.మారిక గిరిజనులకు ఇచ్చిన బిల్లులను వెంటనే తిరిగి తీసుకుంటామని, బిల్లు వసూలుచేయబోమని ప్రకటించడంతో ఆందోళనను విరమించారు. కార్యక్రమంలో మారిక సర్పంచ్ పాతబోయిన పెంటమ్మ,గమ్మెల బాబూరావు, అప్పలనాయుడు, వెంకట్రావు, అసు కుమార్ ,శ్రీను, పాతబోయిన రాము,బుజ్జి,శోభన్‌బాబు పాల్గొన్నారు.