Share News

సైన్స్‌ సెమినార్‌లో జాతీయ స్థాయికి భానుప్రసాద్‌

ABN , Publish Date - Oct 20 , 2025 | 12:00 AM

అక్కివరం ఆదర్శ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి పతివాడ భానుప్రసాద్‌ రాష్ట్ర స్థాయిలో జరిగిన సైన్స్‌ సెమినార్‌-2025లో విజేతగా నిలిచాడు.

సైన్స్‌ సెమినార్‌లో జాతీయ స్థాయికి భానుప్రసాద్‌

డెంకాడ, అక్టోబరు 19(ఆంధ్రజ్యోతి): అక్కివరం ఆదర్శ పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి పతివాడ భానుప్రసాద్‌ రాష్ట్ర స్థాయిలో జరిగిన సైన్స్‌ సెమినార్‌-2025లో విజేతగా నిలిచాడు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి మొత్తం 52 మంది పోటీపడిన ఈ సెమినార్‌లో భానుప్రసాద్‌ ఒక్కడే జాతీయ స్థాయికి ఎంపికయ్యా డు. ఈనెల 18న విజయవాడ లయోలా కాలేజీలో జరిగిన కార్యక్రమంలో ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ఎం.వెంక టకృష్ణరెడ్డి చేతులమీదుగా భానుప్రసాద్‌ ప్రశంస పత్రం అందుకున్నాడు. ఈసందర్భంగా విద్యార్థికి ఆదర్శ పాఠశాలల జేడీ థెరిసా సుల్తానా, డీఈవో మాణిక్యాల నాయుడులు అభినందించారు.

Updated Date - Oct 20 , 2025 | 12:00 AM