Better Services for Farmers రైతులకు మెరుగైన సేవలు
ABN , Publish Date - May 17 , 2025 | 11:20 PM
Better Services for Farmers ఉమ్మడి జిల్లాల పరిధిలో రైతులకు సహకార బ్యాంకుల ద్వారా మెరుగైన సేవలందించేందుకు చర్యలు చేపడుతున్నామని డీసీసీబీ సీఈవో సీహెచ్ ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం గరుగుబిల్లి ప్రాథమిక సహకార సంఘాన్ని పరిశీలించారు.
గరుగుబిల్లి, మే 17 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాల పరిధిలో రైతులకు సహకార బ్యాంకుల ద్వారా మెరుగైన సేవలందించేందుకు చర్యలు చేపడుతున్నామని డీసీసీబీ సీఈవో సీహెచ్ ఉమామహేశ్వరరావు తెలిపారు. శనివారం గరుగుబిల్లి ప్రాథమిక సహకార సంఘాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘ గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ. 2,165 కోట్ల లావాదేవీలు జరిగాయి. డీసీసీబీకి రూ. 7.66 కోట్లు నికర ఆదాయం వచ్చింది. ఇందులో ఒక శాతం 94 పీఏసీఎస్‌లకు అందించాం. సహకార బ్యాంకుల నుంచి ప్రభుత్వ పథకాలకు, టిడ్కో గృహాలతో పాటు మహిళా సంఘాలకు రుణాలు మంజూరు చేశాం. ఉమ్మడి జిల్లాల పరిధిలో సుమారు రూ.90 కోట్ల బకాయిలు ఉన్నాయి. వాటి వసూళ్లకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. బకాయిలున్న వారికి ముందుగా ఆరు నోటీసులు జారీ చేస్తున్నాం. ఆ తరువాత 8, 9 నోటీసులు అందిస్తున్నాం. డీసీసీబీ బ్రాంచ్‌ల పరిధిలో 8, 9 నోటీసులు అందించాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించాం. ఈ ఏడాది రెండు జిల్లాల పరిధిలో రూ. 2,600 కోట్ల లావాదేవీల లక్ష్యంగా పెట్టుకున్నాం. 200 మంది సిబ్బందితో సమావేశం నిర్వహించి డీసీసీబీల ఆర్థిక బలోపేతానికి దిశా నిర్దేశాలు చేస్తున్నాం. నూతనంగా విజయనగరం పరిధిలో 4, పార్వతీపురం పరిధిలో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేస్తాం. గరుగుబిల్లిలో డీసీసీబీ బ్రాంచ్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం.’ అని తెలిపారు. ఈ పరిశీలనలో డీసీసీబీ మేనేజర్ రవికుమార్, ఆప్కాబ్ డీపీఎం గౌరీశంకర్, నోడల్ అధికారి సంతోష్‌కుమార్, సూపర్‌వైజర్, సిబ్బంది పాల్గొన్నారు.