Share News

Better Medical Services మెరుగైన వైద్యసేవలు అందించాలి

ABN , Publish Date - Oct 30 , 2025 | 12:18 AM

Better Medical Services Should Be Provided వర్షాల కారణంగా పీహెచ్‌సీలకు రోగుల తాకిడి పెరగనున్న నేపథ్యంలో అందరికీ మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. బుధవారం దుడ్డుకళ్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.

Better Medical Services   మెరుగైన వైద్యసేవలు అందించాలి
విద్యార్థిని పరామర్శిస్తున్న డీఎంహెచ్‌వో

గుమ్మలక్ష్మీపురం, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): వర్షాల కారణంగా పీహెచ్‌సీలకు రోగుల తాకిడి పెరగనున్న నేపథ్యంలో అందరికీ మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. బుధవారం దుడ్డుకళ్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా రికార్డులు పరిశీలించారు. వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, రోగులకు అందుబాటులో ఉండాలని సూచించారు. సకాలంలో వైద్యసేవలు అందించాలన్నారు. పీహెచ్‌సీలో జ్వరాలతో చికిత్స పొందుతున్న ఆశ్రమ పాఠశాల విద్యార్థిని పరామర్శించారు. అనంతరం దుడ్డుకళ్లు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలను పరిశీలించారు. అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థులు ఎవరైనా ఉన్నారా? అని ఆరా తీశారు. ఆయన వెంట మెడికల్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఉన్నారు.

Updated Date - Oct 30 , 2025 | 12:18 AM