Better Medical Services మెరుగైన వైద్యసేవలందించాలి
ABN , Publish Date - Jul 15 , 2025 | 11:18 PM
Better Medical Services Must Be Provided ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందిం చాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్ శ్రీవాత్సవ ఆదేశించారు. మంగళవారం నీలకంఠాపురం పీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించారు. ఓపీ,డ్రగ్ రిజిస్టర్ పరిశీలించారు.
కురుపాం,జూలై15(ఆంధ్రజ్యోతి): ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలందిం చాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో అశుతోష్ శ్రీవాత్సవ ఆదేశించారు. మంగళవారం నీలకంఠాపురం పీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించారు. ఓపీ,డ్రగ్ రిజిస్టర్ పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం నీలకంఠాపురం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించారు. అక్కడి విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. వంట గది, భోజనాలు, వసతి గృహ గదులను పరిశీలించారు. పాఠశాలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి సూచించారు. ఆ తర్వాత పీఎం జన్‌మాన్ పథకం కింద కోసంగిగూడలో చేపడుతున్న బహుళార్థక సాధక కేంద్ర నిర్మాణాన్ని పరిశీలించారు. త్వరగా పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.
జ్వరాల నియంత్రణకు చర్యలు
పార్వతీపురం, జూలై 15 (ఆంధ్రజ్యోతి): సీజనల్ జ్వరాల నియంత్రణకు పటిష్ఠ చర్యలు చేపట్టాలని ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో శ్రీవాత్సవ ఆదేశించారు. మంగళవారం సాయం త్రం తన కార్యాలయంలో వైద్య ఆరోగ్యశాఖాధికారులతో సమీక్షించారు. మలేరియా ప్రభావిత గ్రామాలపై దృష్టి సారించాలని, గ్రామీణులకు కళాజాత, మొబైల్ వాహనం ద్వారా వ్యాధులు, దోమల నియంత్రణపై అవగాహన కల్పించాలని సూచించారు. జ్వర నిర్ధారణ పరీక్షలు, మందులు అందుబాటులో ఉంచాలన్నారు. ఎక్కడైనా మలేరియా మందుల కొరత ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. పక్కాగా స్ర్పేయింగ్ చేయించాలన్నారు. డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు తదితరులున్నారు.