Pregnant Women గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు
ABN , Publish Date - Apr 11 , 2025 | 11:25 PM
Better Medical Services for Pregnant Women జిల్లాలో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. మాతా శిశు ఆరోగ్య రక్షణే లక్ష్యంగా పనిచేయాలన్నారు.

పార్వతీపురం, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): జిల్లాలో గర్భిణులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డీఎంహెచ్‌వో భాస్కరరావు ఆదేశించారు. మాతా శిశు ఆరోగ్య రక్షణే లక్ష్యంగా పనిచేయాలన్నారు. శుక్రవారం స్థానిక ఎన్జీవో హోంలో ఆశా నోడల్ అధికారులతో ఆయన మాట్లాడుతూ.. గర్భిణులుగా నమోదు చేసినప్పటికీ నుంచి ప్రసవానంతరం వరకు పూర్తిస్థాయిలో ఆరోగ్య తనిఖీలు, వైద్య పరీక్షలు చేయాలన్నారు. డీటీ ఇంజక్షన్లు వేయాలని, ఐరెన్, కాల్షీయం మాత్రలు వేసుకునేలా చూడాలని సూచించారు. గర్భిణుల్లో ఆరోగ్య సమస్యలను సత్వరమే గుర్తించి సమీప ఆసుపత్రులకు తరలించాలని, వారిలో రక్తహీనత నివారణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పీహెచ్‌సీల్లో సాధారణ ప్రసవాలు జరిగేలా చూడాలన్నారు. పిల్లలకు షెడ్యూల్ ప్రకారం టీకాలు వేయాలని తెలిపారు. వేసవి జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ఆశా కార్యకర్తలకు యూనిఫాంలను అందించారు.