Share News

Cycling సైక్లింగ్‌తో ఆరోగ్యం మెరుగు

ABN , Publish Date - Aug 31 , 2025 | 10:54 PM

Better Health with Cycling సైక్లింగ్‌తో ఆరోగ్యం మెరుగుపడుతుందని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు కూడా సైకిల్‌ వినియోగం ఎంతగానో దోహదపడు తుందన్నారు. ఆదివారం పార్వతీపురంలో పోలీసుల ఆధ్వర్యంలో ‘సైకిల్‌ ఆన్‌ సండే’ కార్యక్రమం నిర్వహించారు.

 Cycling  సైక్లింగ్‌తో ఆరోగ్యం మెరుగు
సైకిల్‌ ర్యాలీలో పాల్గొన్న ఎస్పీ

బెలగాం, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): సైక్లింగ్‌తో ఆరోగ్యం మెరుగుపడుతుందని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు కూడా సైకిల్‌ వినియోగం ఎంతగానో దోహదపడు తుందన్నారు. ఆదివారం పార్వతీపురంలో పోలీసుల ఆధ్వర్యంలో ‘సైకిల్‌ ఆన్‌ సండే’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం నుంచి పాతబస్టాండ్‌, బైపాస్‌ రోడ్డు మీదుగా సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎస్పీ సైకిల్‌ తొక్కి అందర్నీ ఉత్సాహపరిచారు. సైక్లింగ్‌తో శారీరకంగా ఫిట్‌గా ఉండొచ్చని ఆయన తెలిపారు. ఫిట్‌ ఇండియా కార్యక్రమంలో అందరూ భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ థామస్‌రెడ్డి, ఆర్‌ఐలు రాంబాబు, పోలీస్‌ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 31 , 2025 | 10:54 PM