Share News

better changes at Uttarapalli ఉత్తరాపల్లికి మహర్దశ

ABN , Publish Date - Jul 22 , 2025 | 11:55 PM

better changes at Uttarapalli గ్రీన్‌ఫీల్డ్‌ హైవేతో మండలంలోని ఉత్తరాపల్లి గ్రామ రూపు రేఖలు మారిపోతున్నాయి. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పూర్తి కావొస్తోంది. మరోవైపు గ్రామ భూముల్లో సుమారు 150 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్‌ పార్కు ఏర్పాటు కానుంది. పనుల ప్రారంభానికి అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండే అత్యాధునిక సౌకర్యాలతో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి పార్కులు మన దేశంలో ఇప్పటివరకు ఐదు మాత్రమే ఉన్నాయి.

better changes at Uttarapalli ఉత్తరాపల్లికి మహర్దశ
గ్రీన్‌ఫీల్డ్‌ పార్కు కోసం సేకరించిన భూములు

ఉత్తరాపల్లికి మహర్దశ

గ్రీన్‌ఫీల్డ్‌ హైవేతో రూపు రేఖలు మారుతున్న గ్రామం

150 ఎకరాల్లో అత్యాధునిక సౌకర్యాలతో పార్కు

దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి పార్కులే ఐదే

కొత్తవలస, జూలై 22(ఆంధ్రజ్యోతి): గ్రీన్‌ఫీల్డ్‌ హైవేతో మండలంలోని ఉత్తరాపల్లి గ్రామ రూపు రేఖలు మారిపోతున్నాయి. గ్రీన్‌ఫీల్డ్‌ హైవే పూర్తి కావొస్తోంది. మరోవైపు గ్రామ భూముల్లో సుమారు 150 ఎకరాల్లో గ్రీన్‌ఫీల్డ్‌ పార్కు ఏర్పాటు కానుంది. పనుల ప్రారంభానికి అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఉండే అత్యాధునిక సౌకర్యాలతో ఈ పార్కును ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి పార్కులు మన దేశంలో ఇప్పటివరకు ఐదు మాత్రమే ఉన్నాయి. ఈ పార్కులో అత్యాధునిక వసతులు కలిగిన హోటళ్లు, విశాలమైన పార్కింగ్‌ స్థలాలు, పెట్రోల్‌ బంక్‌లు, విశ్రాంత భవనాలతో పాటు మరిన్ని అత్యాధునిక వసతులు కలిగిన భవనాలు అందుబాటులోకి రానున్నాయి. విశాఖపట్నం నుంచి చత్తీస్‌గఢ్‌ వరకు గ్రీన్‌ఫీల్డ్‌ హైవే నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ హైవే ద్వారా విశాఖ నుంచి 6 గంటల్లోనే చత్తీస్‌గఢ్‌ చేరుకోవచ్చు. ఇందులో భాగంగా ఉత్తరాపల్లి గ్రామం వద్ద రింగ్‌ రోడ్డు నిర్మిస్తున్నారు. ఈరింగ్‌ రోడ్డు వద్ద మాత్రమే కటింగ్‌ ఉంటుంది. రింగ్‌ రోడ్డు దాటిన తరువాత మళ్లీ ఎక్కడా వేరే మార్గంలో వెళ్లేందుకు అవకాశం ఉండదు. అందుకే గ్రీన్‌ఫీల్డ్‌ పార్కును సిద్ధం చేయనున్నారు. ఇందుకోసం ఉత్తరాపల్లి, రాయపురాజుపేట,దత్తి గ్రామ రెవెన్యూలోని రైతుల నుంచి 150 ఎకరాలను సేకరించారు.

- గ్రీన్‌ఫీల్డ్‌ హైవే కోసం సేకరించిన భూములకు సంబంధించి ఈ మూడు గ్రామ రెవెన్యూలో ఎకరాకు రూ.36 లక్షల రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించారు. రింగ్‌రోడ్డు కోసం సేకరించిన 150 ఎకరాలకు సంబంధించి సుమారు 50 మంది రైతులు తమ భూములకు మరికొంత ధరపెంచి ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. మార్కెట్‌ రేటుకు ప్రభుత్వం ఇస్తున్న ధరకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. నష్టపరిహార ధరపై 30 శాతం మాత్రమే పెంచి ఇచ్చే అధికారం తనకు ఉందని చెబుతూ కలెక్టర్‌ 12 మంది రైతులకు ఎకరాకు ఇచ్చిన 36 లక్షల రూపాయలపై 30శాతం పెంచారు. దీంతో మిగిలిన 38 మంది రైతులు తమకు నష్ట పరిహారం పెంచాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఆమోదం పొందిన వెంటనే పెంచిన నష్టపరిహారం బ్యాంక్‌ అకౌంట్‌లో జమ చేస్తారని సమాచారం ఇచ్చినట్టు రైతులు తెలిపారు.

- గ్రీన్‌ఫీల్డ్‌ హైవేలో ఉడా అప్రూవల్‌ పొందిన లే అవుట్‌ పోయిన వారికి చదరపు గజానికి రూ.6 వేలు చొప్పున పరిహారం అందజేశారు. ఎకరాలలో ఉన్న వారికి మాత్రం ఎకరా ధర ప్రకారం నష్ట పరిహారం ఇచ్చారు. ప్రస్తుతం గ్రీన్‌ఫీల్డ్‌ పార్కుకోసం సేకరించిన భూములకు అదనపు పరిహారం అందిస్తున్నారు.

Updated Date - Jul 22 , 2025 | 11:55 PM