మలేరియాపై అప్రమత్తంగా ఉండండి
ABN , Publish Date - May 08 , 2025 | 11:37 PM
వ్యాధుల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని మలేరియాపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్.భాస్కరరావు ఆదేశించారు.
డీఎంహెచ్‌వో భాస్కరరావు
సీతంపేట రూరల్, మే 8(ఆంధ్రజ్యోతి): వ్యాధుల సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని మలేరియాపై వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఎస్.భాస్కరరావు ఆదేశించారు. గురువారం సీతంపేట ఏజెన్సీలో ఆయన పర్యటించారు. వైటీసీ కేంద్రంలో నిర్వహిస్తున్న గర్భిణుల వసతి గృహాన్ని పరిశీలించారు. వారికి అందుతున్న వైద్యసేవలు, పౌష్టికాహారం వంటి అంశాలపై నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐటీడీఏ కార్యాలయంలో కుసిమి,దోనుబాయి,మర్రిపాడు,బత్తిలి,భామిని పీహెచ్‌సీల వైద్యాధికారులు,సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైరిస్క్ గ్రామాలను గుర్తించి ఆయా పీహెచ్‌సీల సిబ్బంది ఆధ్వర్యంలో ఫీవర్ సర్వే చేపట్టాలని ఆదేశించారు. జ్వరపీడితులు నుంచి రక్తపూతల సేకరించి పాజిటివ్ వచ్చిన వారికి వైద్యసేవలు అందిచాలన్నారు. గిరిజన గ్రామాల్లో దోమల మందు స్ర్పేయింగ్,ఫాగింగ్ వంటి కార్య క్రమాలు చేపట్టాలన్నారు. దోమకాటు వ్యాధుల పై విస్తృతంగా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏసీటీ, క్లోరోక్విన్, ప్రైమాక్విన్ వంటి యాంటీ మలేరియా మందులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో డీఎంవో జేవీ సత్యనారాయణ, డిప్యూటీ డీఎంహెచ్‌వో విజయపార్వతీ, వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.