వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Aug 19 , 2025 | 12:15 AM
వర్షాలు కురుస్తుండడంతో గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్‌సీడీ ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు.
సీతానగరం, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): వర్షాలు కురుస్తుండడంతో గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎన్‌సీడీ ప్రోగ్రాం జిల్లా అధికారి డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు. సోమవారం బూర్జలో వైద్య సిబ్బందితో కలిసి పర్యటించారు. సీజనల్ వ్యాధులు, జ్వరాలు నమోదు, వైద్య సేవలపై గ్రామస్థులను, తాగునీటి నాణ్యత పరీక్షల నివేదికలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. దోమల లార్వా ప్రదేశాలను గుర్తించి ఎప్పటికప్పుడు నివారణ చర్యలు చేపట్టాలని కోరారు.
వ్యాధి నిరోధక టీకాలపై స్పెషల్ డ్రైవ్
గరుగుబిల్లి, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి):పంచాయతీల్లో వ్యాధి నిరోధక టీకాలు వేసేందుకు ఈనెల 23వ తేదీ వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని పీహెచ్‌సీ వైద్యాధికారి ఎన్ ఎంకే తిరుమలప్రసాద్ తెలిపారు.గరుగుబిల్లిలో విలేకరులతో మాట్లాడుతూ జాతీయ వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని అనుసరించి ఇంతవరకు వ్యాక్సిన్ వేయించని పిల్లలకు విధిగా వ్యాధి నిరోదక టీకాలు వేసేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని చెప్పారు.