Share News

ప్రజలతో స్నేహపూర్వకంగా నడుచుకోవాలి

ABN , Publish Date - Nov 10 , 2025 | 12:12 AM

ప్రజలతో స్నేహపూర్వకంగా నడుచుకోవాలని పోలీసులకు ఎస్పీ దామోదర్‌ పిలుపునిచ్చారు.ఆదివారం జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లను వార్షిక తనిఖీలో భాగంగా పరిశీలించారు. స్టేషన్‌ ప్రాంగణాన్ని సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అఽధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పోలీసుస్టేషన్‌ రికార్డులు, సీడీ ఫైళ్లను పరిశీలించారు.

ప్రజలతో స్నేహపూర్వకంగా నడుచుకోవాలి
సంతకవిటి: స్టేష్‌న్‌ పరిసరాలను పరిశీలిస్తున్న ఎస్పీ దామోదర్‌ :

ప్రజలతో స్నేహపూర్వకంగా నడుచుకోవాలని పోలీసులకు ఎస్పీ దామోదర్‌ పిలుపునిచ్చారు.ఆదివారం జిల్లాలోని పలు పోలీసు స్టేషన్లను వార్షిక తనిఖీలో భాగంగా పరిశీలించారు. స్టేషన్‌ ప్రాంగణాన్ని సుందరంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని అఽధికారులను ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం పోలీసుస్టేషన్‌ రికార్డులు, సీడీ ఫైళ్లను పరిశీలించారు.

ఫసంతకవిటి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): పోలీసుస్టేషన్‌కు వచ్చే బాధితులు, వృద్ధులు, మహిళలతో ఆప్యాయంగా పలకరించి, వారి సమ స్యలను శ్రద్ధగా విని, వాటిని పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ తెలిపారు. సంతకవిటి పోలీసు స్టేషన్‌ను ఎస్పీ దామోదర్‌ తనిఖీచేశారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎస్‌.రాఘవులు, రాజాం పట్టణ సీఐ ఆశోక్‌కుమార్‌, ఎస్‌ఐ ఆర్‌.గోపాలరావు, ఏఎసై ఎమ్‌.వాసు దేవరావు పాల్గొన్నారు.

ఫరామభద్రపురం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): శాంతిభద్రతలకు విఘాతం కలిగించి రౌడీ యాక్టివిటీస్‌ చేసే వారికి లాఠీ పోలీసింగ్‌ ఉంటుందని ఎస్పీ ఆర్‌.దామోదర్‌ హెచ్చరించారు. స్థానిక పోలీసు స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడుతూ ప్రతిఒక్కరూ చట్టానికి లోబడి ఉండాలని తెలిపారు. కార్యక్రమంలో బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, బొబ్బిలి రూరల్‌ సీఐ కె.నారాయణరావు, ఎస్‌ఐ వెలమల ప్రసాదరావు, ఏఎస్‌ఐ అప్పారావు పాల్గొన్నారు.

ఫబాడంగి, నవంబరు 9(ఆంధ్రజ్యోతి):బాడంగి పోలీసుస్టేషన్‌ పరిస రాలను ఎస్పీ దామోదర్‌ పరిశీలించారు. స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు.కార్యక్రమంలో బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, బొబ్బిలిరూరల్‌ సీఐ కె.నారాయణరావు, ఎస్‌ఐ తారకేశ్వరరావు పాల్గొన్నారు.

ఫరాజాం రూరల్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి):జిల్లాలో గంజాయి అక్రమ రవాణాదారులపై ఉక్కుపాదం మోపనున్నట్లు ఎస్పీ దామోదర్‌ తెలిపారు. రాజాం టౌన్‌ సర్కిల్‌ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాజాంలో ట్రాఫిక్‌ నియంత్రణకు సిబ్బందిని నియమిస్తామని తెలిపారు.పెండింగ్‌ కేసుల పరిష్కారానికి చర్యలు తీసు కోవాలని సీఐ అశోక్‌కుమార్‌ను ఆదేశించారు.

ఫతెర్లాం, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఆన్‌లైన్‌ మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ దామోదర్‌ కోరారు. తెర్లాం స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఎస్‌ఐ సాగర్‌బాబు ఉన్నారు.

ఫ బొబ్బిలి, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరాల్లో పోలీసులు అష్టకష్టాలు పడి ఛేదిస్తే బిచ్చగాళ్లు మాత్రమే పట్టుబడుతున్నారని, అసలు నేరస్తుల గుట్టు దుర్లభంగా ఉంటోందని ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ తెలిపారు.బొబ్బిలి పోలీసుస్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ బొబ్బిలిలో ఓ ఉపాధ్యాయుడిని డిజిటల్‌ అరెస్టు పేరుతో బెదిరించి రూ. 22 లక్షల 18 వేలను దోచుకున్న కేసులో అరెస్టైన చైన్నైకి చెందిన నలుగురు నిందితులు నిరుపేదలని తెలిపారు. జిల్లాలో పోలీసు సిబ్బంది కొరత ఉందని తెలిపారు. సమా వేశంలో బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి, సీఐలు కటకం సతీష్‌కు మార్‌, కె.నారాయణరావు, ఎస్‌ఐలు రమేష్‌, జ్ఞానప్రసాద్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 10 , 2025 | 12:12 AM