ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - Aug 18 , 2025 | 12:16 AM
:వాహనచోదకులు రహదారి ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని దోనుబాయి ఎస్‌ఐ మస్తాన్ సూచించారు. ఆదివారం కిల్లాడలో వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా మితి మీరిన వేగం, రహదారి భద్రత, డ్రగ్స్, హెల్మెట్ వినియోగంపై వాహనచోదకులకు అవగాహన కల్పించారు.
సీతంపేట రూరల్,ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి):వాహనచోదకులు రహదారి ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలని దోనుబాయి ఎస్‌ఐ మస్తాన్ సూచించారు. ఆదివారం కిల్లాడలో వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా మితి మీరిన వేగం, రహదారి భద్రత, డ్రగ్స్, హెల్మెట్ వినియోగంపై వాహనచోదకులకు అవగాహన కల్పించారు.
ఫ సీతానగరం, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని లచ్చయ్యపేటలో ఆదివారం ఎస్‌ఐ ఎం.రాజేష్ వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనాలపై ఇద్దరికి మించి వెళ్లరాదని, కారు డ్రైవర్లకు సీటు బెట్లు తప్ప నిసరి అని తెలిపారు.హెల్మెట్‌ను ధరించడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్, సీబుక్, పొ ల్యూషన్, ఇన్సూరెన్స్ ఉండాలని సూచించారు.
గంజాయి రవాణా చేస్తే చర్యలు
పాలకొండ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): గంజాయి, డ్రగ్స్ రవాణా చేస్తే చర్యలు తప్పవని సీఐ ఎం.చంద్రమౌళి, ఎస్‌ఐ ప్రయోగమూర్తి హెచ్చరించారు.డ్రగ్స్, గం జాయి, నిషేధిత పదార్థాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పాలకొండలోని గాయత్రీ ఆలయం వద్ద ఏర్పాటుచేసిన అంతర జిల్లా చెక్‌పోస్టును ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటామని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
పి.కోనవలస చెక్‌పోస్టు వద్ద తనిఖీలు
పాచిపెంట, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పి.కోనవ లస వద్ద గల ఆంధ్రా - ఒడిశా సరిహద్దు చెక్‌పోస్టులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సాలూరురూరల్ సీఐ పి.రామకృష్ణ ఆధ్వ ర్యంలో పాచిపెంటఎస్‌ఐ కె.వెంకటసురేష్ సిబ్బందితో తనిఖీచేశా రు. రోడ్డు సేఫ్టీ విధుల్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఫోర్ వీలర్ వాహనచోదకులు సీటు బెల్టు వినియోగించకపోతే కేసులు నమోదుచేస్తామని సీఐ రామకృష్ణ హెచ్చరించారు.