Be Alert వ్యాధులపై అప్రమత్తం
ABN , Publish Date - Nov 28 , 2025 | 11:15 PM
Be Alert About Diseases గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందిని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు ఆదేశించారు. శుక్రవారం ఉల్లిభద్రలో నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు.
గరుగుబిల్లి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని వైద్య సిబ్బందిని డీఎంహెచ్‌వో ఎస్.భాస్కరరావు ఆదేశించారు. శుక్రవారం ఉల్లిభద్రలో నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పరిసరాల పరిశుభ్రతపై గ్రామాస్థులకు అవగాహన కల్పించాలి. ఇళ్ల ముందు , మురుగు కాలువల్లో ప్లాస్టిక్ సామగ్రి లేకుండా చూడాలి. దోమల నియంత్రణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలి. ఎక్కడా మురుగు నీరు నిల్వ లేకుండా చూడాలి. పల్లెల్లో మలేరియా, డెంగ్యూ కేసులు నమోదు కాకూడదు. డ్రైడే వివరాలను విధిగా వీసీహెచ్ యాప్‌లో నమోదు చే యాలి.’ అని తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులు పరిశుభ్రతతో పాటు పలు వ్యాధులపై అవగాహన కల్పించారు. ముస్తాబు కార్యక్రమం ఆవశ్యకతను తెలిపారు. ఆ తర్వాత సచివాలయ సిబ్బందితో సమీక్షించారు. గర్భిణులు, బాలింతలు వివరాలను విధిగా నమోదు చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. గర్భిణుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, రక్తహీనతకు గురికాకుండా చూడాలని ఆదేశించారు.