Share News

కరోనాపై అప్రమత్తం చేయాలి

ABN , Publish Date - Jun 04 , 2025 | 12:07 AM

కరోనా వ్యాప్తి చెందుతున్న నేప థ్యంలోప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం వైద్యులు, సిబ్బందిపై ఉందని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ కేవీఎస్‌ పద్మావతి తెలిపారు. మంగళవారం సీతానగరం పీహెచ్‌సీని తనిఖీ చేశారు.

కరోనాపై అప్రమత్తం చేయాలి
రికార్డులను పరిశీలిస్తున్న పద్మావతి

సీతానగరం, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాప్తి చెందుతున్న నేప థ్యంలోప్రజలను అప్రమత్తం చేయాల్సిన అవసరం వైద్యులు, సిబ్బందిపై ఉందని డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్‌ కేవీఎస్‌ పద్మావతి తెలిపారు. మంగళవారం సీతానగరం పీహెచ్‌సీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందుతుండడంతో దీర్ఘకలిక వ్యాధుల తో ఇబ్బందులు పడుతున్న వారు, గర్భిణుల ఆరోగ్య భద్రతపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరారు. అనంతరం సిబ్బంది హాజరు, రికార్డులను, మందుల నిల్వలను, పీహెచ్‌సీకి వస్తున్న రోగుల సంఖ్యను పరిశీలించా రు. పీహెచ్‌సీలో జరుగుతున్న ఆశావర్కర్ల సమావేశంలో మాట్లాడుతూ ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు క్షేత్రస్థాయిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలని సూచించారు. హెల్త్‌ సూపర్‌వైజర్లు, ఏఎన్‌ఎంలు కరోనా వ్యాప్తిని నిరోధించడానికి జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.

Updated Date - Jun 04 , 2025 | 12:07 AM