Share News

ప్రాథమిక విద్యను పటిష్ఠం చేయాలి

ABN , Publish Date - May 11 , 2025 | 11:58 PM

ప్రాథమిక విద్యను పటిష్టం చేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అకడమిక్‌ కన్వీనర్‌ జేసీ రాజు డిమాండ్‌ చేశారు.

ప్రాథమిక విద్యను పటిష్ఠం చేయాలి
మాట్లాడుతన్న ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అకడమిక్‌ కన్వీనర్‌ జేసీ రాజు

బొబ్బిలి రూరల్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక విద్యను పటిష్టం చేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర అకడమిక్‌ కన్వీనర్‌ జేసీ రాజు డిమాండ్‌ చేశారు. ఆదివా రం స్థానిక ఏపీటీఎఫ్‌ కార్యాలయంలో నిర్వహించి న సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం ఆరు పాఠశాలల పద్ధతిని ప్రవేశపెడితే ప్రస్తుత ప్రభుత్వం తొమ్మిది రకాల పాఠశాలల అమలుకు సన్నాహాలు చేస్తుందన్నారు. ఇలాంటి ప్రయోగాల వల్ల తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర గందరగోళంలో ఉన్నారన్నారు. అనంత రం జిల్లా నాయకుడు జోగినాయుడు మాట్లాడుతూ 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి ప్రకటించాలని, కరువు భత్యం, 11వ పీఆర్సీ బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రమేష్‌, నాగేశ్వరరావు, దర్శనం, చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 11 , 2025 | 11:58 PM