భక్తి శ్రద్ధలతో బక్రీద్
ABN , Publish Date - Jun 07 , 2025 | 11:35 PM
జిల్లాలో శనివారం ముస్లింలు బక్రీద్‌ను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు.
- మసీదుల్లో ప్రార్థనలు చేసిన ముస్లింలు
విజయనగరం, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో శనివారం ముస్లింలు బక్రీద్‌ను భక్తిశ్రద్ధలతో జరుపుకొన్నారు. విజయనగరంలోని ఆబాద్ వీధి, డిక్కిన వీధి కంటోన్మెంట్, జామీయా మసీదు, బాబామోట్టలోని ఖాదర్ బాబా దర్గా, ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న ప్రార్థన మందిరాల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే, నెల్లిమర్ల, రాజాం, చీపురుపల్లి, ఎస్.కోట, గజపతినగరం, వంగర, బొబ్బిలి తదితర ప్రాంతాల్లో ముస్లింలు బక్రీద్ జరుపుకొన్నారు. ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా మసీద్‌లు, దర్గాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు.