Share News

Bakrid భక్తిశ్రద్ధలతో బక్రీద్‌

ABN , Publish Date - Jun 07 , 2025 | 11:35 PM

Bakrid Celebrated with Devotion and Reverence జిల్లాలో ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో బక్రీద్‌ నిర్వహించారు. ఈ సందర్భగా మసీదులు, దర్గాల వద్ద సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. జిల్లా కేంద్రం పాలకొండ రోడ్డులోని జామియా మసీదులో మత గురువులు తయబ్‌ రజా, ఫరూక్‌లు తమ సందేశాన్ని చదివి వినిపించారు.

 Bakrid  భక్తిశ్రద్ధలతో బక్రీద్‌
పార్వతీపురం జామియా మసీదులో ప్రార్ధనలు చేస్తున్న ముస్లింలు

పార్వతీపురం టౌన్‌, జూన్‌ 7 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ముస్లింలు శనివారం భక్తిశ్రద్ధలతో బక్రీద్‌ నిర్వహించారు. ఈ సందర్భగా మసీదులు, దర్గాల వద్ద సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. జిల్లా కేంద్రం పాలకొండ రోడ్డులోని జామియా మసీదులో మత గురువులు తయబ్‌ రజా, ఫరూక్‌లు తమ సందేశాన్ని చదివి వినిపించారు. సర్వమానవాళి సుఖసంతోషాలతో జీవించాలంటే ధర్మసంస్థాపన కోసం ప్రతి ఒక్కరూ శ్రమించాలన్నారు. దేవుని ఆజ్ఞానలను పాటించాలని సూచించారు. దైవం పెట్టే ప్రతి పరీక్షలో నెగ్గుకు రావాలంటే త్యాగాలకు సిద్ధంగా ఉండాలన్నారు. స్నేహభావంతో మెలిగి.. శాంతి సామరస్యతో తోటివారికి సహాయపడాలని సూచించారు. దయతో ఉంటూ దాన ఽధర్మాలు చేస్తూ ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. జిల్లా ముస్లిం మైనార్టీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు సయ్యుద్‌ ఇబ్రహీం హుస్సేన్‌ , సంఘ సభ్యులు రజాక్‌, గౌస్‌, ఫిరోజ్‌, సలీమ్‌, సఫీ, జలాల్‌, బాబ్జీనీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 07 , 2025 | 11:35 PM