Share News

దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి

ABN , Publish Date - Aug 06 , 2025 | 12:22 AM

ప్రతిపక్షనాయకులు దుర్బుద్ధితో దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని టీడీపీ శ్రేణులు తిప్పికొట్టాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన పిలుపునిచ్చారు.

 దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలి
మాట్లాడుతున్న ఎమ్మెల్యే బేబీనాయన

బొబ్బిలి, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): ప్రతిపక్షనాయకులు దుర్బుద్ధితో దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని టీడీపీ శ్రేణులు తిప్పికొట్టాలని బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన పిలుపునిచ్చారు. బొబ్బిలి వ్యవసాయమార్కెట్‌ కమి టీని రాజకీయ పునరావాస కేంద్రంగా కాకుండా నియోజకవర్గ పరిధిలోని రైతులకు పక్కాగా ఉపయోగపడేలా మోడల్‌ ఏఎంసీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఏఎంసీ చైర్మన్‌గా నియమితులైన తెర్లాం మం డలానికి చెందిన టీడీపీ నేత నర్సుపల్లి వెంకటనాయుడు, పాలకవర్గ సభ్యులు మంగళవారం పదవీబాధ్యతలు స్వీకరించారు. జిల్లా మార్కెటిం గ్‌ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టరు రవికిరణ్‌ ఆధ్వర్యంలో నూతన పాలక వర్గ సభ్యులుబాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారందరిచేత ప్రతిజ్ఞ చేయిం చారు. అనంతరం తెర్లాం మండల టీడీపీ నాయకుడు మర్రాపు యుగంధర్‌ అధ్యక్షతన జరిగిన సభలో బేబీనాయన మాట్లాడారు. టీడీపీ నాయకుడు తెంటులక్ష్మునాయుడు మాట్లాడుతూ రైతులసంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని తెలిపారు.కాగావైస్‌చైర్‌పర్సన్‌గా గొర్లె లీలారాణి, పాలకవర్గ సభ్యులుగా కోనారి రమేష్‌, మింది రమాదేవి, లంక రమేష్‌, గునుపూరు అప్పలనరసమ్మ, షేక్‌జిలాని, పొందూరురామారావు, యజ్జలలక్ష్మి, రెడ్డి కృష్ణ కుమారి, సాకేటి గౌరి, టింగలి రాంబాబు, బి.శివకృష్ణ, మూ డడ్ల కృష్ణమూ ర్తి, పసుమర్తి మణి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో బొబ్బిలి పీఏ సీఎస్‌అధ్యక్షుడు, వ్యవసాయశాఖ అసిస్టెంట్‌డైరెక్టరు, జగన్నాఽథపురం సర్పం చ్‌ బొద్దల లక్ష్మి, జిల్లా అగ్రి ట్రేడ్‌ అండ్‌ మార్కెటింగ్‌ అధికారి రవికిరణ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ రాంబార్కి శరత్‌బాబు, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్‌ డైరెక్టరు రౌతురామ్మూర్తి, జనసేన, బీజేపీ ఇన్‌చార్జిలు గిరడ అప్పలస్వామి, మరిశర్ల రామారావునాయుడు, అల్లాడ భాస్కరరావు, పువ్వల శ్రీనివాస రావు పాల్గొన్నారు.

Updated Date - Aug 06 , 2025 | 12:22 AM