పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Aug 13 , 2025 | 12:10 AM
పరిశుభ్రత, ఆరోగ్యంపై విద్యార్థుల్లో అవగాహన కలిగించేలా చూడాలని రాష్ట్ర ఇమ్యునైజేషన్ అధికారిణి హరిణీదేవి సూచించారు. పోలిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని, హైస్కూల్‌ను ఆమె మంగళవారం సందర్శించారు.
భోగాపురం, ఆగస్టు 12(ఆంధ్రజ్యోతి): పరిశుభ్రత, ఆరోగ్యంపై విద్యార్థుల్లో అవగాహన కలిగించేలా చూడాలని రాష్ట్ర ఇమ్యునైజేషన్ అధికారిణి హరిణీదేవి సూచించారు. పోలిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాన్ని, హైస్కూల్‌ను ఆమె మంగళవారం సందర్శించారు. రికార్డుల ను తనిఖీచేశారు. వ్యాధి నిరోధక టీకాలపై వైద్య సిబ్బందితో మాట్లాడి ఆరా తీశారు. అనంతరం హైస్కూల్‌ను సందర్శించి, విద్యార్థులకు ఆరో గ్యం, పరిశుభ్రతపై అవగాహనకలిగించాలని ఉపాధ్యాయులకు సూచిం చారు. విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలు వేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాఇమ్యునైజేషన్ అధికారి అచ్యుత్‌కుమారి, డీపీహెచ్‌వో శాంతికుమారి, శ్రవంతి, శ్రీరాం పాల్గొన్నారు.
: