‘Surya Ghar’ ‘ సూర్యఘర్’పై అవగాహన
ABN , Publish Date - Oct 17 , 2025 | 12:13 AM
Awareness on ‘Surya Ghar’ ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని, దీనిని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ కె.మల్లికార్జునరావు కోరారు. గురువారం సాలూరు విద్యుత్ శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలిచ్చారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు జిల్లాలో 620 సూర్యఘర్ యూనిట్లు ఉన్నాయన్నారు.
సాలూరు,అక్టోబరు16(ఆంధ్రజ్యోతి): ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని, దీనిని ప్రతిఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని విద్యుత్ శాఖ ఎస్‌ఈ కె.మల్లికార్జునరావు కోరారు. గురువారం సాలూరు విద్యుత్ శాఖ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. సిబ్బందికి పలు సూచనలిచ్చారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు జిల్లాలో 620 సూర్యఘర్ యూనిట్లు ఉన్నాయన్నారు. విద్యుత్ శాఖలో ఏఈలు కొరత ఉందని తెలిపారు. మక్కువ మండలంలో బేలుగొండ మినహా అన్ని గ్రామాలకు విద్యుత్ సేవలు అందుతున్నాయని వెల్లడించారు. కొండలపై ఉన్న ఆ గ్రామానికి విద్యుత్ స్తంభాలు చేర్చడం కష్టతరమవుతోందన్నారు. ఆ ప్రాంతంలో ఎనిమిది కుటుంబాలకు కరెంట్ సరఫరా కావడం లేదని తెలిపారు. విద్యుత్ సమస్యలపై 1912 ట్రోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌చేస్తే.. 24 గంటల్లో పరిష్కా రిస్తామన్నారు.