Share News

POCSO పోక్సోపై అవగాహన తప్పనిసరి

ABN , Publish Date - Jul 15 , 2025 | 11:20 PM

Awareness on POCSO is Essential మహిళలపై ఎవరూ అనుచితంగా ప్రవర్తించరాదని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. పోక్సో చట్టం, దీని ద్వారా ఎటువంటి శిక్షలు అమలుతావుతాయన్న దానిపై ప్రతిఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు.

  POCSO   పోక్సోపై అవగాహన తప్పనిసరి
సమావేశంలో మాట్లాడుతున్న ఎస్పీ

పాలకొండ, జూలై 15 (ఆంధ్రజ్యోతి): మహిళలపై ఎవరూ అనుచితంగా ప్రవర్తించరాదని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. పోక్సో చట్టం, దీని ద్వారా ఎటువంటి శిక్షలు అమలుతావుతాయన్న దానిపై ప్రతిఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. మంగ‌ళ‌వారం పాలకొండ ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌-1 ఈగల్‌ క్లబ్‌, పోలీస్‌ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్‌ అబ్యూజ్‌ వల్ల వ్యక్తి, కుటుంబం, సమాజం ఎలా నష్ట పోతుందో వివరించారు. సైబర్‌ క్రైం జరిగే విధానాలు, వాటి విషయంలో ఎలా అప్రమత్తంగా ఉండాలో తెలియజేశారు. బ్యాంకు అకౌంట్‌లో నుంచి హ్యాకర్స్‌ డబ్బులు దోచుకుంటే పోలీస్‌లను ఎలా సంప్రదించాలో వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ ఎం.రాంబాబు కళాశాల వైస్‌ ప్రిన్సి పాల్‌ బి.జయమణి, సీఐ, ఎస్‌ఐలు, అధ్యాపకులు , కళాశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jul 15 , 2025 | 11:20 PM