Criminal Laws కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన ఉండాలి
ABN , Publish Date - Aug 22 , 2025 | 11:25 PM
Awareness of the New Criminal Laws is Essential కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన ఉండాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీసు అధికారులు, సిబ్బందితో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.
బెలగాం, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): కొత్త క్రిమినల్ చట్టాలపై అవగాహన ఉండాలని ఎస్పీ ఎస్‌వీ మాధవరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో పోలీసు అధికారులు, సిబ్బందితో నెలవారీ నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ లేకుండా పని చేయాలి. పెండింగ్ కేసులను త్వరతగతిన పూర్తి చేయాలి. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నేరస్థులను పట్టు కోవాలి. గణేష్ ఉత్సవాల నేపథ్యంలో మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు ఆన్‌లైన్ ద్వారా తప్పనిసరిగా అనుమతి పొందాల్సి ఉంది. పోలీస్ స్టేషన్‌లో నమోదైన ప్రతి కేసు వివరాలను సీసీటీఎన్‌ఎస్‌లో ఎప్పటికప్పుడు పొందుపరచాలి. కోర్టులో త్వరతిగతిన అభియోగపత్రాలు సమర్పించాలి. బీఎన్‌ఎస్‌ఎస్ యాక్టు కేసుల్లో క్రైమ్ సీన్ విజిట్ నిమిత్తం ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ సాయం తీసుకోవాలి. ఎస్‌హెచ్‌వోలకు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. ఈ-ఎఫ్‌ఐఆర్, జీరో ఎఫ్‌ఐఆర్ ప్రతి పోలీస్ స్టేషన్‌లో అమలు చేయాలి. హవాలా, వాహన దొంగతనం, హ్యూమన్ ట్రాఫింగ్ సంబంధించిన నేరాలపై దృష్టి సారించాలి. ఎస్‌హెచ్‌వోలకు ఎన్‌సీఆర్‌బీ పోర్టల్ లాగిన్ ఉంది. సైబర్ నేరాల్లో కావలిసిన సమాచారం కోసం బ్యాంకులకు నేరుగా లేఖ పెట్టొచ్చు.’ అని తెలిపారు. అంతకుముందు శాంతి భద్రతల పరిరక్షణ, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులు, మర్డర్, ప్రాపర్టీ, చీటింగ్, గంజాయి, రోడ్డు ప్రమాదాలు తదితర కేసులపై సమీక్షించారు. పెండింగ్ కేసులపై ఆరా తీసి వాటి పరిష్కారానికి తగిన సూచనలు, సలహాలు అందించారు. అనంతరం విధుల్లో ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బంది, అధికారులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో పార్వతీపురం ఏఎస్పీ అంకితా సురాన, డీఎస్పీ థామస్ రెడ్డి, సీఐలు తదితరులు పాల్గొన్నారు.