Yogandra Competitions రాష్ట్రస్థాయి యోగాంధ్ర పోటీల్లో జిల్లాకు బహుమతులు వచ్చినట్టు గిరిజన సంక్షేమశాఖ డీడీ ఆర్.కృష్ణవేణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు
ABN , Publish Date - Jun 17 , 2025 | 12:06 AM
Awards for the District in State-Level Yogandra Competitions ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి యోగాంధ్ర పోటీల్లో జిల్లాకు రెండు బహుమతులు వచ్చినట్టు గిరిజన సంక్షేమశాఖ డీడీ ఆర్.కృష్ణవేణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు
సాలూరు రూరల్, జూన్ 16 (ఆంధ్రజ్యోతి ): ఎన్టీఆర్ జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి యోగాంధ్ర పోటీల్లో జిల్లాకు రెండు బహుమతులు వచ్చినట్టు గిరిజన సంక్షేమశాఖ డీడీ ఆర్.కృష్ణవేణి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఈ పోటీలకు జిల్లా నుంచి 49 మంది వెళ్లారు. తొలిరోజు పోటీల్లో స్కిట్ విభాగంలో 18 వరకు బృందాలు పాల్గొన్నాయి. జిల్లాకు చెందిన ఎనిమిది మంది బృందం తృతీయ బహుమతిని కైవసం చేసుకుంది. వాల్‌పేపర్ పెయిటింగ్ పోటీల్లో జిల్లాకు చెందిన విద్యార్థి తృతీయ బహుమతిని సాధించింది. యోగాంధ్రలో పాటలు, యోగాసనాలు తదితర పోటీలు మంగళవారం సైతం జరగనున్నాయి.’ అని ఆమె తెలిపారు.