Best Schools ఉత్తమ పాఠశాలలకు అవార్డులు
ABN , Publish Date - Aug 15 , 2025 | 11:39 PM
Awards for Best Schools రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఎంపికైన జిల్లాలో రెండు పాఠశాలలకు శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవార్డులు అందించారు.
గుమ్మలక్ష్మీపురం/సీతంపేట రూరల్, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి పురస్కారాలకు ఎంపికైన జిల్లాలో రెండు పాఠశాలలకు శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవార్డులు అందించారు. గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి పీటీజీ బాలికల గురుకుల పాఠశాల, సీతంపేట ఐటీడీఏ పరిధి హడ్డుబంగి గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలు ఏటా పదోతరగతి ఫలితాల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తమ పాఠశాలలుగా అవి ఎంపికయ్యాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఎ.సత్యవతి, ఉమావాణి విజయ వాడలోని ఇందిరాగాంధీ మున్సిపాల్ స్టేడియం మైదానంలో సీఎం చేతుల మీదుగా అవార్డులు, ప్రశంసాపత్రాలు స్వీకరించారు. తమ పాఠశాలలకు రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు రావడంతో విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.