Plastic Materials ప్లాస్టిక్ సామగ్రిని వాడొద్దు
ABN , Publish Date - Nov 20 , 2025 | 12:30 AM
Avoid Using Plastic Materials పంచాయతీల పరిధిలో ప్లాస్టిక్ వస్తువులు, పాలిథిన్ కవర్లను ఎవరూ వాడరాదని జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు సూచించారు. బుదవారం గొట్టివలస, మరుపెంట పంచాయతీల్లో పర్యటించారు.
గరుగుబిల్లి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): పంచాయతీల పరిధిలో ప్లాస్టిక్ వస్తువులు, పాలిథిన్ కవర్లను ఎవరూ వాడరాదని జిల్లా పంచాయతీ అధికారి టి.కొండలరావు సూచించారు. బుదవారం గొట్టివలస, మరుపెంట పంచాయతీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దుకాణదారులు ప్లాస్టిక్ సామగ్రిని విక్రయించినా.. వినియోగించినా చర్యలు తప్పవన్నారు. సచివాలయాల సిబ్బంది ఆకస్మిక తనిఖీలతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్లాస్టిక్ వినియోగంతో కలిగే అనర్థాలను వివరించాలని ఆదేశించారు. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు. అంటువ్యాధులు ప్రబలకుండా చూడాలని, నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పంచాయతీల్లో వ్యాధులు ప్రబలితే సంబంధిత సిబ్బందే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తాగునీరు కలుషితం కాకుండా క్లోరినేషన్ చర్యలు చేపట్టాలన్నారు. దోమలు నివారణకు విధిగా ఫాగింగ్ నిర్వహించాలని ఆదేశించారు. గృహాల నుంచి సేకరించిన వ్యర్థాలను సంపద కేంద్రాలకు తరలించాలన్నారు. ఈ పరిశీలనలో డిప్యూటీ ఎంపీడీవో గోపాలరావు, కార్యదర్శి ఎం.భార్గవనాయుడు, సిబ్బంది అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.